తెలంగాణాలో త్వరలో కేటీఆర్ సీఎం అవుతున్నారనే వార్త హాట్ టాపిక్ గా మారింది.. గత కొన్ని రోజులుగా తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ కల్వకుంట్ల తారక రామారావు  సీఎం కాబోతున్నారని మీడియాలో, పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. తొందర్లోనే కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నారని కేటీఆర్ ఆ బాధ్యతలు చేపట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయనే ప్రచారం రోజు రోజు కి పెరిగిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు డేట్ కూడా ఫిక్స్ చేసినట్లు సోషల్ మీడియా లో వార్తలు ప్రచారం అవుతున్నాయి..  ఫిబ్రవరి 18వ తేదీ కేటీఆర్ పట్టాభిషేకానికి మంచి ముహూర్తంగా కేసీయార్ ఇప్పటికే డిసైడ్ చేశారనే ప్రచారం జరుగుతుంది.

నిజానికి 2018 లో జరిగిన ముందస్తు ఎన్నికల సమయంలో కేటీఆర్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడుతున్నారని ప్రచారం జరిగింది. కానీ ఏ కారణం చేతనో అది కార్యరూపం దాల్చలేదు.. 2019 లోనూ ఇలాంటి తరహా పరచారమే జరిగింది. కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్తున్నారు, రాష్ట్రం బాధ్యత మొత్తం కేటీఆర్ కి అప్పగిస్తున్నారని ప్రచారం జోరుగా సాగింది. అయితే అది కూడా ఎందుకో జరగలేదు.  ఈనేపథ్యంలో ఇప్పుడు కూడా అదే తరహా ప్రచారం జరుగుతుంది.. ఈసారి డేట్ తో సహా కేటీఆర్ ప్రమాణ స్వీకారం అంటూ ప్రచారం ఊపందుకుంది..

ఈ నేపథ్యంలో  సీనియర్ నేత, మంత్రి ఈటెల రాజేందర్ దీనిపై ఓ స్పష్టత ని ఇచ్చే పనిచేశారు. కేటీయార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటే తప్పేమిటి అంటూ మీడియాను ఎదురు ప్రశ్నించారు. దాంతో సీఎంగా కేటీయార్ అనే ప్రచారం ఒక్కసారిగా పెరిగిపోతోంది.  ఇప్పటికే కేటీయార్ అనధికారిక సీఎంగా చెలామణి అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. పార్టీ కార్యక్రమాలు , ప్రభుత్వ నిర్ణయాలు కూడా ఎక్కువ భాగం కేటీయారే తీసుకుంటున్నారు. దీనికి తోడు టీఆర్ఎస్ శాసనసభాపక్షంలో కేటీఆర్ ను వ్యతిరేకించేవారు కూడా లేరు. ఈ నేపథ్యంలో  కేటీయార్ కు పట్టాభిషేకం అనే ప్రచారంలో ఎంతవరకు నిజముందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: