వ్యాక్సినేషన్‌పై వస్తున్న పుకార్లను నమ్మొద్దని కేంద్ర ప్రభుత్వం కోరింది. కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాలు రెండూ సురక్షితమేనని స్పష్టం చేసింది. కొందరు వైద్య సిబ్బంది టీకా తీసుకునేందుకు నిరాకరించడం బాధిస్తోందని.. వారు ముందుకు రావాలని కోరింది. మరోవైపు, దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మరింత వేగం పుంజుకుంది.

వ్యాక్సినేషన్‌తో ఎలాంటి దుష్ప్రభావాలూ లేవని కేంద్రం మరోమారు స్పష్టం చేసింది. దేశీయంగా ఉత్పత్తి చేసిన కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌లు.. బాగా పనిచేస్తున్నాయని స్పష్టం చేసింది. టీకా ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 0.18శాతం ప్రతికూలత కేసులు మాత్రమే నమోదయ్యాయని తెలిపింది.

వ్యాక్సినేషన్ లో భారత్‌ సరికొత్త కూడా నెలకొల్పింది. తొలి రోజున మొత్తం 2లక్షల7వేల మంది టీకా వేయించుకోగా.. యూఎస్‌లో ఆ సంఖ్య 79వేలుగా, యూకేలో 19వేలుగా నమోదయింది. దీంతో అమెరికాలో వ్యాక్సినేషన్‌ ప్రారంభించిన తొలి వారంలో 5లక్షల అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అదే భారత్‌లో మూడో రోజునే ఆ సంఖ్యకు చేరువైంది. .

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ తొమ్మిది రాష్ట్రాల్లో 70శాతానికి పైగా పనితీరు కనబరించిందని కేంద్రం తెలిపింది. లక్షద్వీప్ లో 89.3, సిక్కిం 85, ఒడిశా 82, తెలంగాణ 81, యూపీ 71.4,  రాజస్థాన్‌ లో 71.3 శాతం చొప్పున నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. దేశవ్యాప్తంగా మంగళవారం నాటికి 4లక్షల54వేల మంది ప్రజలు కరోనా వైరస్‌ టీకా వేయించుకున్నారు.

దేశంలో ప్రస్తుతం ఉన్న క్రియాశీల కేసుల కంటే ఇప్పటివరకూ వ్యాక్సిన్‌ తీసుకున్నవారి సంఖ్య రెట్టింపుగా ఉందని కేంద్రం తెలిపింది. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 4లక్షల 54వేల 49 మంది వ్యాక్సిన్‌ తీసుకోగా, ప్రస్తుతం దేశంలో 2లక్షల 528 యాక్టివ్‌ కేసులున్నట్టు వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిరాటంకంగా జరుగుతోంది. తెలంగాణలో కొందరు హెల్త్‌కేర్‌ వర్కర్లు.. వ్యాక్సిన్‌ తీసుకోవడానికి సంకోచిస్తుండగా.. అవ‌గాహన కలిగిస్తూ వాక్సినేష‌న్ చేస్తున్నారు వైద్యసిబ్బంది.

తెలంగాణలో ఈ ఒక్కరోజు వాక్సినేష‌న్ కు హాలిడే ఇచ్చారు. గురువారం నుంచి తిరిగి వాక్సినేష‌న్ కొన‌సాగ‌నుంది. నిన్న 70వేల మందికిపైగా వ్యాక్సిన్‌ వేయాలని ప్లాన్‌ చేయగా.. కేవలం 51వేల 997 మంది మాత్రమే వాక్సిన్ వేసుకున్నారు. కాగా, 51 మందిలో రియాక్షన్స్‌ కనిపించాయి. అయితే, వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది.


పుకార్లను నమ్మి మోసపోవద్దు..!





మరింత సమాచారం తెలుసుకోండి: