రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధి లోని హిమాయత్ సాగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మహిళా డాక్టర్ కారులో వెళుతున్న సమయం లో అకస్మాత్తుగా కార్ కీ కుక్క అడ్డం వచ్చింది. ఈ క్రమం లోనే అప్రమత్తమైన లేడీ డాక్టర్ కుక్కను తప్పించ బోయి కారు పల్టీలు కొట్టి చెట్ల పొదల్లో కి దూసుకెళ్లింది. ఈ ఘటన తో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఇక ఈ ఘటనలో లేడీ డాక్టర్ తీవ్రంగా గాయ పడగా స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.
అంతే కాకుండా స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే స్థానికంగా ఒక ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ నైట్ డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో హిమాయత్ సాగర్ వద్దకు రాగానే రోడ్డుకి అడ్డంగా ఓ కుక్క పడుకుని ఉండడం తో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే అప్పటికి నైట్ డ్యూటీ పూర్తి చేసి నిద్ర మొత్తంలో ఉన్న సదరు లేడీ డాక్టర్ కుక్కను తప్పించబోగా కారు వేగంగా ఉండడంతో పల్టీలు కొట్టి పొదల్లోకి ఎగిరిపడింది అని పోలీసులు తెలిపారు.