అయితే జగన్ వేవ్‌లో భరత్ కేవలం 4 వేల ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్ధిపై ఓడిపోయారు. అసలు ఇక్కడ భరత్ గెలుపు ఖాయమని అంతా అనుకున్నారు. కానీ జనసేన నుంచి పోటీ చేసిన జేడీ లక్ష్మీనారాయణ దాదాపు 2 లక్షలపైనే ఓట్లు తెచ్చుకున్నారు. దీంతో ఓట్లు చీలిపోయి భరత్‌కు డ్యామేజ్ జరిగింది. అలాగే బీజేపీ నుంచి పురంధేశ్వరి పోటీ చేసి 30 వేల ఓట్లు వరకు తెచ్చుకున్నారు. దీని వల్ల భరత్ ఓటమి అనివార్యమైంది. అదే బీజేపీ-జనసేనల సపోర్ట్ ఉంటే భరత్ గెలుపు సులువయ్యేది. కానీ అనూహ్యంగా భరత్ 4 వేల ఓట్లతో ఓడిపోయారు.
అయితే ఓడిపోయాక భరత్ గీతం యూనివర్సీటీ బాధ్యతలు చూసుకుంటూనే, విశాఖపట్నంలో పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం చేస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో భరత్ పనిచేస్తున్నారు. భరత్ కష్టానికి బీజేపీ-జనసేనలు మళ్ళీ నష్టం తెచ్చే అవకాశాలు లేకపోలేదు. నెక్స్ట్ ఎన్నికల్లో బీజేపీ-జనసేనలు పోటీ చేసి ఓట్లు చీల్చే ఛాన్స్ ఉంది.
పైగా విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కానుండటం వైసీపీకి అడ్వాంటేజ్. ఒకవేళ టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకుని ముందుకెళితే భరత్ సులువు అవుతుందని తెలుస్తోంది. లేదంటే భరత్ గెలుపు కోసం గట్టిగా కష్టపడాలి. వైసీపీ మీద తీవ్ర వ్యతిరేకిత వస్తే అప్పుడు గెలిచే ఛాన్స్ ఉంటుంది. కానీ ప్రస్తుతం పరిస్థితిని చూస్తుంటే అలా కనిపించడం లేదు. మొత్తానికైతే బీజేపీ-జనసేనల వల్ల బాలయ్య చిన్నల్లుడుకు నష్టం తప్పేలా లేదు.