జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి వైసీపీ నాయకులపై గర్జించారు. వైసిపి నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. జన సైనికులు మర్యాదగా పద్దతిగా ఉంటారని.. కానీ తేడా వస్తే మాత్రం యుద్ధం చేస్తారని పవన్ కల్యాణ్ అన్నారు. ఒంగోలులో కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న జనసేన కార్యకర్త మృతికి పవన్ కల్యాణ్ సంతాపం ప్రకటించి.. అక్కడ ప్రసంగించారు.
పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే.. నా కార్యకర్తలకు అన్యాయం జరిగితే కాళ్ళు చేతులు ముడుచుకొని కూర్చోలేను... కానీ నాకు విధానం ఉంది.. వైసిపి నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి.. మర్యాదగా , పద్దతిగా ఉంటాం, తేడా వస్తే యుద్ధం చేస్తాం అంటూ గర్జించారు పవన్ కల్యాణ్. గతంలో పీఆర్పీ నుంచి పని చేసిన అన్నా రాంబాబు ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తారా.. అని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో మీరు అసెంబ్లీ లో అడుగుపెట్టకుండా చూస్తామని పవన్ శపథం చేశారు. వైసిపి నాయకులకు హెచ్చరిస్తున్నా.. జనసేన బిడ్డలు జోలికి వెళ్తే అంతు చూస్తాం.. అంటూ వార్నింగ్ ఇచ్చారు.
రోడ్డు వేయమని ఎమ్మెల్యే రాంబాబు ను అడిగిన వెంగయ్య ను బెదిరించి, ఆత్మహత్య కు ప్రేరేపిస్తారా..? ప్రశ్నిస్తే చంపేస్తాం అనే వారికి భయం పుట్టేలా పని చేస్తాం.. డబ్బు, మదంతో మాట్లాడితే ఆగేదిలేదు.. పోలీసులు కూడా బాధ్యత తో పనిచేయాలి.. వెంగయ్య ఆత్మహత్య పై బాధ్యులపై కేసులు నమోదు చేయాలన్నారు పవన్ కల్యాణ్. గతంలో ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా నేను కీలక వ్యక్తిని.. అప్పుడు నేను గుర్తింపు కోసం రాలేదు.. ప్రకాశం పంతులు గారి తరువాత ఎవరూ సంపూర్ణ రాజకీయాలు చేసినవారు లేరు.. మద్యం, మైనింగ్ వ్యాపారాలు చేసేవారు రాజకీయ నాయకులా? అని ప్రశ్నించారు పవన్ కల్యాణ్. మన రాజకీయాలు మన పిల్లల భవిష్యత్తు కోసం.. వందలు ఆటోలు తిప్పి బియ్యం సరఫరా చేస్తే ప్రజలు అవసరాలు తీరినట్లేనా.. అన్నారు పవన్ కల్యాణ్.