ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోల హవా ఎక్కువైపోతుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి అరడజనుకు పైగా హీరోలు తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వడమే  అంతేకాకుండా తమదైన శైలిలో ప్రేక్షకులను అలరించి గుర్తింపు సంపాదించుకున్నారు.  అటు దగ్గుపాటి ఫ్యామిలీ విషయానికి వస్తే దగ్గుబాటి రానా ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై విలక్షణ నటుడిగా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు అనే విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు నందమూరి ఫ్యామిలీ నుంచి మాత్రం కొత్త హీరో ఎంట్రీ ఇవ్వకపోవడం గమనార్హం.




 బాలకృష్ణ తర్వాత నందమూరి ఫ్యామిలీ నుంచి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చారు. వీరు ఎంట్రీ ఇచ్చి దశాబ్దాలు గడిచిపోతున్నప్పటికి కొత్త హీరో ఎంట్రీ మాత్రం ఇప్పటివరకు జరగలేదు. ఈ క్రమంలోనే బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడూ ఉంటుందా  అని అటు నందమూరి అభిమానులు అందరూ వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక మోక్షజ్ఞ ఎంట్రీ అప్పుడు ఇప్పుడు అని వార్తలు రావడమే తప్ప ఇప్పటివరకు ఎప్పుడూ మోక్షజ్ఞ ఎంట్రీ పై మాత్రం క్లారిటీ రాలేదు. పలు ఇంటర్వ్యూలలో బాలకృష్ణ  మోక్షజ్ఞ ఎంట్రీ పై ఇప్పుడు వచ్చినప్పటికీ కూడా సమాధానం దాటవేస్తూ వచ్చారు.



 ఈ క్రమంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు ఉండబోతుంది అనే దానిపై ఆసక్తి నెలకొంది.  ప్రస్తుతం బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ పై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది.  టాలీవుడ్ లోకి హీరోగా మోక్షజ్ఞ ఎంట్రీ జూన్ లో  ఉండబోతుంది అనేది తెలుస్తుంది. జూన్ 10వ తేదీన నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు ఉన్న సందర్భంలో అదేరోజు మోక్షజ్ఞ చిత్రాన్ని ప్రారంభించాలని బాలకృష్ణ  భావిస్తున్నారట. అయితే మోక్షజ్ఞ మొదటి చిత్రానికి పూరి జగన్నాథ్ కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. పూరి సిద్ధం చేసిన కథ బాలకృష్ణకు తెగ నచ్చేసిందట. మోక్షజ్ఞ మొదటి సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ఉండిపోతుంది అని  ప్రస్తుతం టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: