రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డిస తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు అంగీకరిస్తే మళ్లీ తిరిగి తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు రాయలసీమ అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. రాయలసీమను అభివృద్ధి చేయాలని ప్రధాని మోడీని చంద్రబాబును కోరతానని చెప్పారు. టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నాడంటూ అతను ఆ పార్టీ నుండి బయటకు వెళ్లిపోయారు.  అప్పటికే ఆయన రాయలసీమ హక్కుల కోసం పోరాడుతున్నారు. దాని కోసం రాయలసీమ హక్కుల పరిరక్షణ సమితిని స్థాపించారు. కాగా బైరెడ్డి సాయి ఈశ్వరుడు హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు. హత్య కేసులో అతను 2014 మార్చి నెలలో అజ్ఞాతంలోకి వెళ్లాడు. దీంతో పార్టీ బాధ్యతలను ఆయన కూతురు తీసుకున్నారు. ఆమె సారథ్యంలోనే ఎన్నికల్లో పోటీ చేశారు. అనంతరం ఎన్నికల అనంతరం సెప్టెంబరు నెలలో ఆయన హత్య కేసులో కోర్టు ఎదుట లొంగిపోయారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: