తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఎంపికైన నాటి నుంచి బీజేపీ ఎంత దూకుడుగా వ్యవహరిస్తోందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.  ఇక ప్రతీ విషయంలో కూడా కేసీఆర్ సర్కారు తప్పులను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయవంతం అవుతున్నారు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్. ముఖ్యంగా ఎప్పటినుంచో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయాలని భావిస్తున్న ఢిల్లీ పెద్దలు కూడా ఎంతో వ్యూహాత్మకంగానే తెలంగాణ రాజకీయాల్లో అడుగులు వేస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 ఈ క్రమంలోనే ప్రస్తుతం తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షం గా మారిన బిజెపి అడుగడుగున సవాల్ ని విసురుతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే వరుసగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని పార్టీగా కొనసాగుతున్న అధికార టీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవలే మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ విరుచుకుపడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.


  తెలంగాణ రాజకీయాల్లో  టీఆర్ఎస్, బీజేపీ పార్టీల కూటమిగా ఏర్పడ పోతున్నాయి అంటూ కొన్ని వార్తలు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై స్పందించిన బండి సంజయ్ టీఆర్ఎస్ బీజేపీ పార్టీల మధ్య ఎలాంటి సంబంధం లేదు అంటూ తేల్చి చెప్పారు. తాను ఢిల్లీ పెద్దలతో మాట్లాడానని..ఇక త్వరలో టిఆర్ఎస్, బిజెపి ఒక్కటి కాబోతున్నాయి అంటూ కేసిఆర్ అసత్య ప్రచారం చేస్తున్నారు అంటూ మండి మండిపడ్డారు   బండి సంజయ్..  తాను బిజెపి పెద్దలతో మాట్లాడానని అలాంటిది ఏమీ లేదు అంటూ స్పష్టం చేశారు. కేసీఆర్ ఢిల్లీ వెళితే ఎవరూ పట్టించుకోలేదని తన కొడుకుని సీఎం చేయడానికి కేసీఆర్ కొత్త నాటకాలకు తెరలేపుతున్నారు అంటూ విమర్శించారు బండి సంజయ్.

మరింత సమాచారం తెలుసుకోండి: