కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతు చట్టాలను తీసుకు వచ్చింది అనే విషయం తెలిసిందే. అయితే ఈ చట్టాల విషయంలో కొన్ని రోజుల వరకు సైలెంట్ గానే ఉన్నా రైతులందరూ కూడా ఇటీవలే తీవ్రస్థాయిలో ఉద్యమం బాట పట్టడం సంచలనంగా మారిపోయింది. ముఖ్యంగా ఎంతోమంది పంజాబ్ రైతులు ఉద్యమాల బాట పట్టి అటు  ఢిల్లీ సరిహద్దులను నిర్బంధించి ఆందోళనలు నిరసనలు చేపడుతున్నారు.  ఈ క్రమంలోనే దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో పరిస్థితి హాట్ హాట్ గా మారిపోయింది. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి పలుమార్లు రైతు సంఘాలతో చర్చలు జరిపినప్పటికీ ఇక విఫలం అయ్యాయి అనే విషయం తెలిసిందే.



 అయితే ఇటీవలే ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి.  ప్రశాంత వాతావరణంలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామని రైతు సంఘాలు చెప్పుకొచ్చాయి. ఈ క్రమంలోనే  ఒక్కసారిగా రైతు సంఘాలు ఉద్రిక్తత పరిస్థితులు సృష్టించిన విషయం తెలిసిందే. ఢిల్లీలో కి చొరబడిన రైతు సంఘాలు ఎర్రకోటకు లోకి చొచ్చుకొనిపోయి ఇక ఎర్రకోట పై జాతీయజెండా కు బదులు పంజాబ్ జెండాను ఎగరవేయడం సంచలనంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రైతులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా రైతులు పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొనడంతో రైతులు, పోలీసులకు గాయాలయ్యాయి.



 అయితే రైతులు ఇటీవల సృష్టించిన ఉద్రిక్త పరిస్థితుల పై స్పందించిన పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ ట్రాక్టర్ల ర్యాలీలో కొన్ని శక్తులు హింసకు పాల్పడటం పంజాబ్ ముఖ్యమంత్రి తప్పుబడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటిఘటనలు శాంతియుత వాతావరణంలో జరుగుతున్న ఉద్యమాల పట్ల ఉన్న మంచి ఉద్దేశ్యాన్ని దెబ్బతీస్తాయి అంటూ వ్యాఖ్యానించారు. కొన్ని ఘటనలు షాకింగ్ గా ఉన్నాయి అంటూ తెలిపిన అమరేందర్ సింగ్..  హింసకు పాల్పడితే సహించేది లేదు అంటూ చెప్పుకొచ్చారు. నిజమైన రైతులను వెంటనే ఢిల్లీ నుండి ఖాలి  చేసి సరిహద్దు లోకి రావాలి అంటూ సూచించారు అమరేందర్ సింగ్.

మరింత సమాచారం తెలుసుకోండి: