ఏపీలో అధికార వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు వ‌రుస‌గా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక యేడాది వ‌ర‌కు సైలెంట్ గానే ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడిప్పుడే వార్త‌ల్లోకి ఎక్కుతున్నారు. ఇక ప్ర‌కాశం జిల్లా గిద్ద‌లూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు వ‌రుస‌గా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. తాజాగా ఆయ‌న ఓ జ‌న‌సేన కార్య‌క‌ర్త‌పై దూషిస్తూ మాట్లాడ‌గా స‌ద‌రు కార్య‌క‌ర్త వెంగ‌య్య నాయుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ వీడియోలు సోష‌ల్ మీడియాలో కూడా జోరుగా వైర‌ల్ అయ్యాయి.

దీంతో ప్ర‌కాశం జిల్లాలో అన్నా రాంబాబును టార్గెట్ చేస్తూ జ‌న‌సేన సైనికులు తీవ్రంగా విరుచుకు ప‌డుతున్నారు. అన్నా రాంబాబుపై పవన్ కల్యాణ్ జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు. తాము తలుచుకుంటే అన్నా రాంబాబును పాతాళానికి తొక్కేస్తాం అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీనిపై అన్నా రాంబాబు ఘాటుగా స్పందిస్తూ తాను రాజీనామా చేస్తాన‌ని.. ప‌వ‌న్‌కు ద‌మ్ముంటే త‌న‌పై పోటీ చేసి గెల‌వాల‌ని స‌వాల్ విసిరారు. ప‌వ‌న్ పై అన్నా విమ‌ర్శ‌లు చేయ‌డంతో జనసేన పార్టీ ప్రకాశం జిల్లా ఇన్చార్జి రియాజ్ బదులిచ్చారు.

అన్నా రాంబాబుపై పోటీ చేయ‌డానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ అక్క‌ర్లేద‌ని.. ఆయ‌న రాజీనామా చేస్తే మృతి చెందిన వెంగ‌య్య నాయుడు భార్య‌ను పోటీ చేయిస్తాం ద‌మ్ముంటే ఆమెపై గెల‌వాల‌ని రియాల్ స‌వాల్ చేశారు. ప‌వ‌న్ గురించి అన్నా మాట్లాడడం చాలా కామెడీగా ఉంద‌ని కూడా రియాజ్ చెప్పారు. అస‌లు రాంబాబు పోటీ చేస్తే టిక్కెట్ ఇచ్చేందుకు కూడా వైసీపీ సిద్ధంగా లేద‌ని రియాజ్ ఎద్దేవా చేశారు.

భూక‌బ్జాలు చేసి కోట్లాది రూపాయ‌ల ఆస్తులు కూడ‌బెట్టిన రాంబాబు నీతి నిజాయితీల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఏదేమైనా అన్నా రాంబాబు ను జ‌న‌సేన ఈ రేంజ్‌లో టార్గెట్ చేయ‌డంతో పాటు తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డం ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయాలను ఒక్క‌సారిగా హాట్ హాట్ గా మార్చేసింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: