జగన్ కేబినెట్‌లో ఫైర్ బ్రాండ్ మంత్రులు ఎవరంటే...ఠక్కున కొడాలి నాని, పేర్ని నానీల పేర్లు చెప్పేయొచ్చు. ఒకే జిల్లాకు చెందిన ఈ ఇద్దరు మంత్రులు జగన్ కేబినెట్‌లో కీలకంగా ఉన్నారు. తమ ప్రభుత్వానికి అండగా ఉంటూ, తమ అధినేత జగన్ మీద ఈగ వాలనివ్వకుండా ప్రతిపక్షాలకు చుక్కలు చూపిస్తుంటారు. ఒకరు పరుషమైన పదజాలంతో ప్రతిపక్షాన్ని దూషిస్తే , మరొకరు తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ వెటకారం చేస్తారు.
అయితే ఇలా జగన్‌కు అండగా ఉన్న ఈ ఇద్దరు మంత్రులకు చెక్ పెట్టాలని టీడీపీ ఎప్పటి నుంచో చూస్తుంది. ఇద్దరు నానీలకు చెక్ పెట్టి రాజకీయంగా పైచేయి సాధించాలని అనుకుంటుంది.

కానీ అది పెద్దగా వర్కౌట్ కావడం లేదు. కానీ ఇప్పుడు పంచాయితీ ఎన్నికల రూపంలో ఇద్దరు నానీల హవాని అడ్డుకునే అవకాశం వచ్చింది. పైగా  ఇద్దరు పక్క పక్క నియోజకవర్గాల్లోనే ఉంటారు. కొడాలి నాని గడివాడకు, పేర్ని నాని మచిలీపట్నం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే బాగా స్ట్రాంగ్‌గా ఉన్న ఈ ఇద్దరుకు చెక్ పెట్టడం టీడీపీకి సాధ్యమయ్యే పని కాదు. కానీ జనసేన రూపంలో ఇద్దరు నానీలకు భలే షాక్ రెడీగా ఉందని చెప్పొచ్చు. ఇటీవల పవన్ కళ్యాణ్, ఇద్దరు నానీల మధ్య ఎలాంటి వార్ జరిగిందో అందరికీ తెలిసిందే.

అప్పటి నుంచి ఈ రెండు నియోజకవర్గాల్లో ఉన్న జనసేన కార్యకర్తలు తిరుగుబాటు మొదలు పెట్టారు. వీరికి ఎలాగైనా చెక్ పెట్టాలని చూస్తున్నారు. ఒకవేళ పంచాయితీ ఎన్నికల్లో జనసేన సత్తా చాటితే, ఇద్దరు నానీలకు షాక్ తగలడం గ్యారెంటీ. ఎందుకంటే రెండు నియోజకవర్గాల్లో పవన్ అభిమానులు ఉన్నారు. అలాగే కాపు ఓటర్లు కూడా ఎక్కువ ఉన్నారు. పంచాయితీ పోరులో జనసేన దిగితే కొన్ని ఓట్లు చీలిపోయి, టీడీపీకి లబ్ది చేకూరి, ఇద్దరు నానీలకు డ్యామేజ్ జరిగిన ఆశ్చర్యపోనవసరం లేదు. మరి చూడాలి ఇద్దరు నానీలకు జనసేన వల్ల షాక్ ఉంటుందో లేదో. 

మరింత సమాచారం తెలుసుకోండి: