ఏపీలో అధికార వైసీపీ హవా ఎక్కువగా ఉందనే సంగతి తెలిసిందే. ఆ పార్టీకి 151 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అలాగే టీడీపీ-జనసేన నుంచి వచ్చిన ఎమ్మెల్యేలని కూడా కలుపుకుంటే 156 మంది ఎమ్మెల్యేలు అవుతారు. దీని బట్టి చూస్తే వచ్చే నెలలో జరగబోయే పంచాయితీ ఎన్నికల్లో ఎవరి హవా ఎక్కువ ఉంటుందో అర్ధమైపోతుంది. అధికార బలం ఉన్న వైసీపీ మెజారిటీ పంచాయితీలని కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.
అయితే టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నచోటా  వైసీపీ ఏ మేర సత్తా చాటుతుందనేది చూడాలి. అయితే టీడీపీ ఎమ్మెల్యేలు కూడా స్ట్రాంగ్ ఉన్నారు.

ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు బాగా బలంగా ఉన్నారు. గత ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలుగా గెలిచారు. రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి భవాని, రాజమండ్రి రూరల్ నుంచి బుచ్చయ్య చౌదరీ, పెద్దాపురం నుంచి చినరాజప్ప, మండపేట నుంచి వేగుళ్ల జోగేశ్వరావులు గెలిచారు. అయితే ఈ నలుగురు బలంగానే కనిపిస్తున్నారు. అయితే ఇందులో రాజమండ్రి సిటీ పూర్తిగా కార్పొరేషన్ పరిధిలో ఉంది కాబట్టి, భవానిని పక్కనబెడితే…రూరల్, మండపేట, పెద్దాపురం నియోజకవర్గాల్లో పంచాయితీ పోరు జరగనుంది.

ఈ స్థానాల్లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీకి ధీటుగా ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లో టీడీపీనే ఎక్కువ పంచాయితీలు గెలిచేలా కనిపిస్తోంది. పైగా ఈ మూడు చోట్ల ఉన్నా ఎమ్మెల్యేలకు సొంత ఇమేజ్ బాగానే ఉంది. దీనికితోడు ఈ నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్‌ఛార్జ్‌ల పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. రూర‌ల్లో ఆకుల వీర్రాజు, పెద్దాపురంలో ద‌వులూరి దొర‌బాబు ప‌రిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.

ఇక మండ‌పేట ఇన్‌చార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మ‌నసంతా రామ‌చంద్రాపురం మీదే ఉంది. దీంతో ఆయ‌న ఇక్క‌డ దృష్టి పెట్టే ప‌రిస్థితి లేదు. ఇక్కడ జనం సంక్షేమ పథకాల్ని దృష్టిలో పెట్టుకుంటే వైసీపీకి ఓటు వేస్తారు. లేదంటే అంతే సంగతులు. కానీ టీడీపీ ఎమ్మెల్యేలకు ఉన్న బలం బట్టి చూస్తే, ఈ మూడుచోట్ల ఫ్యాన్‌కు సైకిల్ షాక్ తప్పేలా లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: