ఇలాంటి ప్రకటనలు ఈ మధ్యకాలంలో కేబుల్ టీవీ లో సోషల్ మీడియాలో ఎన్నో వస్తూనే ఉన్నాయి. ఇలాంటి ప్రకటనలు నమ్మిన ఓ మహిళ చివరికి నకిలీ బాబా చేతికి చిక్కి నాలుగు లక్షలు మోసపోయిన ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది. అంబర్పేట్ కి చెందిన మహిళ కేబుల్ టీవీ లో జాఫర్ ఖాన్ అనే బాబా ప్రకటన చేసింది. ఇక భార్యభర్తలిద్దరి మధ్య కలహాలు రావడంతో వేరుగా ఉంటున్నారు. సమస్యలు తీరి పోవాలని బాబా ను ఆశ్రయించింది మహిళ. ఇక ప్రత్యేక పూజలు చేస్తే మీ సమస్య పరిష్కారమవుతుందని 5600 రూపాయలు వసూలు చేశాడు.
ఇక ఆ తర్వాత ప్రార్థనలు పేరుతో 33000, మరో కారణం చెప్పి 42000 ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. ఆ తర్వాత ప్రార్థనలు చేయకుండానే ఏవో శక్తులు అడ్డుపడుతున్నాయి అని చెప్పి ఇక పూజల కోసం అరవై వేలు వసూలు చేశాడు. ఇలా పూజలు అర్ధంతరంగా ఆగిపోతే కుటుంబంలో ఎవరైనా ప్రాణాలు కోల్పోతారు అని భయపెట్టి మరిన్ని డబ్బులు వసూలు చేశారు. ఇలా విడతలవారీగా నాలుగు లక్షల వరకు వసూలు చేశాడు. కానీ కుటుంబ కలహాలలో మాత్రం ఎలాంటి మార్పులు రాకపోవడంతో చివరికి బాబాను నిలదీయగా మళ్ళీ మొదటినుంచి పూజలు చేయాలి అని మాట మార్చాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నకిలీ బాబా కోసం గాలింపు చర్యలు చేపట్టారు.