ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. ఒకప్పుడు ఆంధ్ర తెలంగాణా అన్నదమ్ముల వలె కలిసి ఉండేవి. కాని కేసీఆర్ తమకు ప్రత్యేక తెలంగాణా కావాలంటూ అప్పుడు కేంద్రాన్ని చాలా ఒత్తిడి చేశాడు. రాష్ట్ర విభజన కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం ఎన్నో నిరాహార దీక్షలు చేశాడు. ఎంతో కష్టపడ్డాడు. ఎట్టకేలకు ఎలాగోలా 2014 లో రాష్ట్రాన్ని విభజించి ప్రత్యేక తెలంగాణా ని సాధించాడు. ఇక మొదట్లో కేసీఆర్ పాలన బాగానే సాగింది. జనాలు కూడా ఆయనను ఆయన చేసిన మంచి పనులకు  బాగానే మెచ్చుకొని కొనియాడారు. కాని కాల క్రమేణా కేసీఆర్ తెలాంగాణాని సరిగ్గా పట్టించుకోలేదు. ఇక జనాలు కూడా కేసీఆర్ పాలన పై పెదవి విరుస్తున్నారు.

కొత్త కొత్త పథకాలు ప్రవేశ పెట్టలేక కేంద్రం పెట్టిన పథకాలనే తను పెట్టిన పథకాలుగా ప్రజలను నమ్మించాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు. కాని జనాలకు పూర్తిగా అర్ధమవుతుంది. ఇక అసలు విషయానికి వస్తే కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం దాకా జీతాలు పెంచడం జరిగింది. అయితే దాని వల్ల గవర్నమెంట్ ఉద్యోగస్తులకి తప్ప సాటి  పేద వాడికి ఎలాంటి ఉపయోగం లేదు. ఒక పక్క రాష్ట్రంలో పేద ప్రజలకు ఆసరాగా కొత్త పథకాలు ప్రవేశపెట్టడానికి డబ్బులు లేని కేసీఆర్.. మరి అనవసరంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి దాదాపు 100 కి సగం శాతం జీతాలు ఎందుకు పెంచినట్టు? రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉండగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఇప్పుడు జీతాలు పెంచాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక దీనిపై సాటి ప్రేక్షకులు కేసీఆర్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులతో పేద వారికి ఏమైనా చెయ్యకుండా కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఇప్పుడు జీతాలు పెంచడం ఏం బాగలేదంటూ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన రాజకీయ వార్తల గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: