
అయితే ఇప్పుడు తాజాగా మరో హాట్ న్యూస్ మన ముందుకొచ్చింది.
ప్రస్తుతం ఎన్నికల కమీషన్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న వాణీ మోహన్ ను తన ఆదేశాలు అనుసరించడం లేదంటూ.. ఇలా అయితే ఎలక్షన్ లో సమస్యలు ఏర్పడవచ్చు అంటూ, ప్రభుత్వానికి సరెండర్ చేశారు ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్. కాకపోతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించే సమయంలో ఎన్నికల సంఘానికి కార్యదర్శి అవసరం కీలకం కావడంతో ఆ పోస్టుకు ముగ్గురు అధికారుల పేర్లు తెలపాలని... వారిలో ఒకరిని ఎన్నుకుంటాం అని, ప్రభుత్వానికి లేఖ రాశారు నిమ్మగడ్డ.
ఇందుకు స్పందించిన ప్రభుత్వం అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని ముగ్గురు అధికారుల పేర్లతో కూడిన జాబితాను సూచించింది. అందులో కన్నబాబు, విజయ్ కుమార్, రాజబాబు ల పేర్లున్నాయి. ఆ జాబితాను పరిశీలించిన ఎస్ఈసి అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్...ఈ జాబితాను పరిశీలించిన నిమ్మగడ్డ.. కన్నబాబును కార్యదర్శిగా ఎంపిక చేసి నియమించారు. దాంతో కన్నబాబును ఎన్నికల కమిషన్ సెక్రటరీగా బదిలీ చేసింది ప్రభుత్వం. మరోవైపు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇలా వరుస పెట్టి అధికారుల బదిలీ చేస్తుండడం, ప్రభుత్వానికి లేఖల రాస్తుండడంతో... ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మొన్నటికి మొన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద సంచలన కామెంట్లు చేసిన అంబటి రాంబాబు... ఇప్పుడు మరో పంచ్ విసిరారు. "తక్షణమే వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా తొలగించి, ఆ స్థానంలో చంద్రబాబుని నియమించవలసిందిగా నిమ్మగడ్డ గవర్నర్ కి లెటర్ రాసినా ఆశ్చర్యపోకండి. ఆయనకు “పిచ్చిముదిరింది”. అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేశారు అంబటి రాంబాబు.