కొన్ని కొన్ని సార్లు మన ప్రియమైన వారితో జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో ఊహించని ఘటనలు  జరిగి  తీరని విషాదాన్ని నింపుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.  అంతా ఆనందంగా ఉన్న సమయంలో విధి చిన్నచూపు చూడటంతో ఇక ప్రియమైన వారు కానరాని లోకాలకు వెళ్ళి పోతూ ఉంటారు. ఇక వారు లేని జీవితాన్ని ఊహించుకోలేకుండా  కొంతమంది.  ఇక తమను విడిచి దూరం అయిన వారి ధ్యాసలోనే  ఎన్నో రోజుల పాటు బ్రతుకుతూ ఉంటారు. మరి కొంతమంది ఇక ప్రియమైన వారు లేకుండా జీవితాన్ని ఊహించుకోలేక ఏకంగా మనస్థాపంతో ప్రాణాలు కూడా కోల్పోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.



 సాధారణంగా మనకు ప్రియమైన వారు చనిపోయినప్పుడు ఇష్టం లేకపోయినప్పటికీ వారికి అంత్యక్రియలు నిర్వహించడం తప్పనిసరి అనే విషయం తెలిసిందే. ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఇది సర్వసాధారణం. కానీ ఇక్కడ ఒక కూతురు మాత్రం కన్న తల్లి చనిపోతే జీర్ణించుకోలేక పోయింది. ఇక తల్లి లేకుండా తాను జీవించలేను అని అనుకుంది. ఈ క్రమంలో తల్లికి అంత్యక్రియలు నిర్వహించకుండానే తల్లి శవాన్ని తన దగ్గరే ఉంచుకుంది. ఒక రోజు రెండు రోజులు కాదు ఏకంగా పదేళ్లపాటు ఫ్రీజర్లో తల్లి శవాన్ని ఉంచుకొని తల్లి తనతో ఉన్నట్లుగా ఊహించుకుని జీవిస్తుంది ఇక్కడ ఒక కూతురు.





 జపాన్ లో ఈ  ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.  48 ఏళ్ళ  ఒక మహిళ తన తండ్రిపై అమితమైన ప్రేమ చూపిస్తూ ఉంటుంది. అయితే తన తల్లితో కలిసి జీవిస్తూ ఉండేది. అయితే ఇటీవలే తన తల్లి అనారోగ్యం బారిన పడి మృతి చెందింది. ఈ క్రమంలోనే కూతురు గుండె పగిలిపోయింది. తల్లి లేని జీవితం ఎలా అని ఊహించుకో లేకపోయింది. ఎవరికీ  చెప్పకుండా తన తల్లి మృతదేహాన్ని పదేళ్ల నుంచి ఫ్రీజర్ లో దాచి పెట్టి తల్లి తోనే ఉంటున్నట్లుగా భావించింది. అయితే ఇటీవలే కరోనా  వైరస్ కారణంగా ఆర్థిక ఇబ్బందులతో అద్దె  చెల్లించకపోవడంతో ఖాళీ చేయాలి అంటూ ఇంటి యజమాని కోరాడు. ఎంతకి  ఖాళీ చేయకపోవడంతో.. పోలీసులు రంగంలోకి ఖాళీ చేయించే ప్రయత్నంలో శవాన్ని గుర్తించగా.. ఇక అసలు నిజం బయటపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: