విద్యాసంస్థల ప్రారంభ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఓ యాక్షన్ ప్లాన్‌ను రూపొందించింది. ఆయా జిల్లాల కలెక్టర్లు చైర్మన్‌గా కమిటీలను సైతం ఏర్పాటు చేసింది. కరోనా నేపథ్యంలో విద్యాసంస్థల్లో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఆయా యాజమాన్యాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనేదానిపై నివేదికను రూపొందించి అమలు చేస్తోంది. దీని ప్రకారం ప్రతీ విద్యాసంస్థను శానిటైజ్ చేయాలి. విద్యార్థులు సూళ్లు, కళాశాలలకు వెళ్లాలంటే తల్లిదండ్రుల అంగీకార పత్రం తప్పనిసరి. ముఖ్యంగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ స్కూళ్లను నిర్వహించాల్సిందే.
నో మాస్క్ నో ఎంట్రీ అన్న రూల్‌ను ఖచ్చితంగా పాటించాలని విద్యాసంస్థల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు అధికారులు. మాస్కులు లేకుంటే కాలేజీలోకి విద్యార్ధులను అనుమతించవద్దని సూచించారు. స్కూళ్లలో కోవిడ్ నిబంధనలను విధిగా పాటించాలని.. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రైవేట్ స్కూళ్లలో విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ క్లాసులు నిర్వహించాలంటే అదనపు గదులు, విశాలమైన గదులు అవసరం. దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం స్కూళ్లలో జరుగుతున్న ప్రిపరేషన్‌ను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
మొత్తానికి స్కూళ్లలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. స్కూల్ సిబ్బంది ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తున్నారు. అంతేకాదు మాస్కులు ఉంటేనే విద్యార్థులను లోపలికి వచ్చేందుకు అనుమతి ఇస్తున్నారు. పైగా తల్లిదండ్రుల పర్మీషన్ ఉంటేనే స్కూల్లోకి అలో చేస్తున్నారు. మొత్తానికి కరోనా నిబంధనల మధ్య స్కూళ్లు తెరుచుకున్నాయి.