ఇక ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించిన బడ్జెట్ తో ఇప్పటికే కిరోసిన్ పై ఉన్న రాయితీ పోయింది. ఇక అంతే కాకుండా అటు వంటగ్యాస్ పై ఉన్న సబ్సిడీ కూడా క్రమక్రమంగా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సామాన్య ప్రజలపై భారం మరింతగా పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. గతంలో అతి తక్కువ ఉన్న వంటగ్యాస్ ధర ప్రస్తుతం ఆకాశాన్నంటేలా అంతకంతకు పెరిగి పోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సామాన్య ప్రజలు వంట గ్యాస్ కొనుగోలు చేయాలంటేనే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంట గ్యాస్ ధర తగ్గుతుందేమో అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
అయితే బడ్జెట్లో ఈ పథకానికి దాదాపు 25 వేల కోట్ల మేర నిధులు తక్కువగా విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఈ భారం మొత్తం ప్రస్తుతం వినియోగదారుడే మోయాల్సి వచ్చే అవకాశం ఉంది. ఐదేళ్ల కిందట నగదు బదిలీ పథకం అమలు అయ్యే సమయంలో.. ఒక్కొక్క సిలిండర్ పై దాదాపు 300 రూపాయలు సబ్సిడీ ఆయా వినియోగదారుల బ్యాంకు ఖాతాలో జమ అవుతూ ఉండేది. ఆ సమయంలో ఎంతో మంది గ్యాస్ వినియోగదారులు ఎంతో ప్రయోజనం పొందే వారు. కానీ ప్రస్తుతం పూర్తిగా పరిస్థితులు మారిపోయాయి. అతి తక్కువ మొత్తంలో ప్రస్తుతం సబ్సిడీ ఆయా వినియోగదారుల ఖాతాల్లో జమ అవుతుంది.