తాను రాజకీయ నాయకులను తప్పు పట్టడం లేదని.. పోలీసులు చాలా ఓవర్ చేస్తున్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు. పాలకొండ డిఎస్పీ , టెక్కలి సిఐ లు వైసిపి కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.రేపు టీడీపీ అధికారంలోకి వచ్చాక నేను హోం మినిస్టర్ పదవి తీసుకిని తప్పుడు కేసులు పెట్టిన పోలీసుల సంగతి తెలుస్తానంటూ హెచ్చరించారు. రేపు అధికారంలోకి వచ్చేది మేమే... చంద్రబాబు నాయుడుని అడిగి మరీ హోం మినిస్టర్ పదవి తీసుకుంటానని ఘాటు స్వరంతో హెచ్చరికలు జారీ చేశారు.
తన ఇంట్లో బెడ్ రూం లో ఉన్న తనకు పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారంటూ ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఖాకీ డ్రెస్ అంటే అసహ్యం వేస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక అచ్చెన్న ను అరెస్టు చేసిన తర్వాత పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కోర్టులో హాజరు పరిచే ముందు కోటబొమ్మాళి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఏదేమైనా అచ్చెన్న రేపు తామే అధికారంలోకి వస్తామని.. తానే హోం మంత్రి అయ్యి పోలీసుల అంతు చూస్తానని సవాల్ విసరడం రాజకీయ వర్గాల్లో నే కాకుండా... అటు విపక్ష టీడీపీ నేతల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది.