ఈ మధ్యకాలంలో మనుషుల ప్రాణాలకు అసలు విలువ లేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే. చిన్నచిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్న ఎంతోమంది ఇక ఎంతో విలువైన ప్రాణాలు తీసుకుంటున్నారు.  పెళ్లయిన తర్వాత భార్య పిల్లలు ఉన్నప్పటికీ వారి గురించి ఆలోచించకుండా చివరికి మనస్థాపం చెంది ఆత్మహత్యలు చేసుకుంటూ కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసే  పరిస్థితులు తీసుకొస్తున్నారు.  వెరసి రోజురోజుకు ఇలా బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య ఎక్కువవుతూనే ఉంది. ఇక క్షణికావేశంలో  తీసుకుంటున్న నిర్ణయాలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి అనే విషయం తెలిసిందే



 ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన చోటు చేసుకుంది.  అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో కుటుంబ కలహాలు అతడిని ఎంతో మనస్థాపానికి గురి చేసాయి. రోజురోజుకు కుటుంబ కలహాలు పెరిగిపోతున్న నేపథ్యంలో..  ఇక బలవన్మరణానికి పాల్పడి జీవితానికి ముగింపు పలకాలని అనుకున్నాడు సదరు వ్యక్తి. అప్పటికే అతనికి భార్య పిల్లలు ఉన్నారు.  అయితే వారిని ఒంటరి చేసి వెళ్లడం ఇష్టం లేకపోయినప్పటికీ ఇక మనసు కఠినం చేసుకుని  ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏకంగా కూతురు ని ఎత్తుకొని చెరువు గట్టుకు వెళ్ళిన తండ్రి కూతురిని చెరువు గట్టుపై కూర్చోబెట్టి ఇక చెరువులో దూకి ఆత్మహత్యచేసుకున్నాడు.


 ఈ విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లా హనుమాన్ నగర్ కాలనీలో చోటు చేసుకుంది.  కాలనీకి చెందిన బి రమేష్ అనే 30 ఏళ్ల వ్యక్తి కుటుంబ కలహాలతో మనస్థాపం చెంది చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య భర్తలు ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో మనస్తాపం చెందిన రమేష్  కూతురు ని ఎత్తుకొని సమీపంలో ఉన్న చెరువు వద్దకు వెళ్ళాడు. గట్టుపై కూతురుని కూర్చోబెట్టి ఇక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.  కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: