![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_analysis/nellore-ysrcpc5852ba2-22c2-4c11-a475-5f410a674df1-415x250.jpg)
2014 ఎన్నికల తర్వాత నారాయణను చంద్రబాబు ఎమ్మెల్సీని చేయడంతో పాటు మంత్రిని చేశారు. ఆతర్వాత ఆయన్ను సీఆర్డీయే చైర్మన్ గా కూడా చేశారు. ఒకేసారి జిల్లాకు చెందిన నారాయణకు ఇన్ని కీలక పదవులు రావడం మామూలు విషయం కాదు. ఇక గత ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. టీడీపీ పాలనలో ఈ మాత్రం అయినా నెల్లూరు కాపు / బలిజలకు గుర్తింపు వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వంలో కాపులకు ఎన్ని పథకాలు అమలు చేసినా గత ఎన్నికల్లో జిల్యా వ్యాప్తంగా ఉన్న మెజార్టీ కాపులు వైసీపీకే ఓట్లేశారు.
ఈ జిల్లాలో అన్ని కులాలతో పాటు కాపులు.. కాపు ఉప కులాల వారు కూడా వైసీపీకే ఓట్లే యడంతో జిల్లాలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా వైసీపీ కోల్పోలేదు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇక్కడ కాపులకు ఎంత మాత్రం గుర్తింపు లేదని వారు వాపోతున్నారు. స్థానికంగానే కాకుండా.. ఇతరత్రా చిన్నా చితకా పదవుల్లోనూ వారిని ఎవ్వరూ పట్టించు కోవడం లేదు. ఇప్పుడు అధికార పార్టీలో కాపు వర్గం నుంచి ఎమ్మెల్యే కాదు కదా.. కనీసం జిల్లా స్థాయిలో మంచి పదవి ఉన్న నేతలు కూడా లేరు.
ఈ క్రమంలోనే ఈ సారి నెల్లూరు జిల్లా కాపుల ఆలోచన మారుతున్నట్టే కనిపిస్తోంది. ఇదే పరిస్థితి ఉంటే ఈ సారి మాత్రం తాము వైసీపీకి ఓట్లేయమనే చాలా మంది చెపుతున్నారు. మరి జగన్ ఈ జిల్లా కాపులకు కొంత వరకు అయినా న్యాయం చేస్తారేమో ? చూడాలి.
కాపు సోదరులారా.. రండి.. ఉద్యమించండి..!
రాష్ట్రంలో కాపు సోదరులు.. రాజకీయ పార్టీలకు ఆటవస్తువుగా మారిపోయారనడంలో సందేహం లేదు. కాపుల సుదీర్ఘ డిమాండ్‌గా ఉన్న రిజర్వేషన్ అంశాన్ని కొన్ని పార్టీలు ఓటు బ్యాంకు చేసుకుంటే.. మరికొన్ని పార్టీలు ఉదాశీనంగా తీసుకున్నాయి. ఫలితంగా కాపులు ఓటు బ్యాంకుగా ఉపయోగపడుతున్నప్పటికీ.. వారి నిజమైన కోరికలు.. డిమాండ్లు.. ఎక్కడివక్కడే ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో తన గళం ద్వారా కాపుల సమస్యలను, డిమాండ్లను అటు ప్రభుత్వానికి, ఇటు రాజకీయ నేతలకు వినిపించేందుకు నడుం బిగించింది https://www.indiaherald.com/ కాపు సామాజిక వర్గం సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు, వారికి అన్ని విధాలా అండగా నిలిచేందుకు https://www.indiaherald.com/ నిర్ణయించింది.
కాపు సోదరులు చేయాల్సిందల్లా.. ఈ ఫోన్ నెంబరు 8919011959 కు ఫోన్ చేయడమే. లేదా care@indiaherald.com ఈ మెయిల్‌కు మీ సమస్యను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడమే..! మీ తరఫున మీవాయిస్‌ను https://www.indiaherald.com/ వినిపిస్తుంది. మీ సమస్యల పరిష్కారంలో https://www.indiaherald.com/ సైనికుడై పోరాడుతుంది! ఈ ఉద్యమంలో ప్రతి కాపు సోదర, సోదరీమణులకు భాగస్వామ్యం కల్పిస్తోంది https://www.indiaherald.com/