మన దేశ చరిత్రలో బ్రాహ్మణులకి ఒక అద్భుతమైన చరిత్ర వుంది. ఒక దేవునికి  భక్తునికి మధ్య వారధి అంటే బ్రాహ్మణుడు మాత్రమే. అందుకే బ్రాహ్మణులను సమాజంలో అందరూ గౌరవిస్తారు. వారి విధానాలు, ఆచారాలు అన్ని ఒక పద్ధతి ప్రకారం ఉంటాయి. ఏదైనా వారు ఒక పని మొదలు పెడుతున్నారంటే దాని వెనకాల చాలా అర్ధం దాగి ఉంటుంది.హిందూ ఆధ్యాత్మిక ధ‌ర్మంలో ఏం చేయాల‌న్నా.. బ్రాహ్మ‌ణులు చేయాల్సిందే. మ‌ఠాలైనా.. ఆశ్ర‌మాలైనా.. పీఠాలైనా.. కూడా ఆధ్యాత్మిక రంగంలో బ్రాహ్మ‌ణుల‌దే పెద్ద‌పీట‌. భగవంతునికి నైవేద్యం పెట్టాలన్న భక్తునికి ప్రసాదం పెట్టాలన్న గుడికి వచ్చే ప్రతి పేదవాడికి కడుపు నిండేలా అన్నదానం చెయ్యాలన్న అందులో బ్రాహ్మణుల  పాత్రలు, హస్తాలు  వుండాల్సిందే. అలా లేనిచో ఆ పనులకు  ఎలాంటి అర్ధం లేదు.



ఇంట్లో మంచి కోసం పూజలు చెయ్యాలన్న బ్రాహ్మణులే ముఖ్య పాత్ర పోషిస్తారు. ఏ మంచి శుభకార్యం జరగాలన్న బ్రాహ్మణులే ముందుండి జరిపిస్తారు. మన దేశ చరిత్రలో ఏ కులం వారైన గుడికి వచ్చి దేవునికి దండం పెట్టుకోని పూజారుల దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటారు.అంతటి గొప్ప గౌరవం సమాజంలో కేవలం బ్రాహ్మణులకి మాత్రమే ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాని నేటి సమాజంలో వారు ఆర్ధికంగా చాలా బాధపడుతున్నారు.మనకోసం ఎన్నో మంచి పనులు చేసే బ్రాహ్మణులకు ప్రభుత్వం ఖచ్చితంగా ముందుకు వచ్చి వారికి అండగా నిలవాలి. వారిని గుర్తించాలి..ఇక రాష్ట్రంలో చాలా గుడులు కూడా సరిగ్గా లేవు కొన్ని గుడులకు నీటి సమస్య ఎక్కువగా వుంది.గుడిలో సరిగ్గా కులాయిలు పని చెయ్యడం లేదు. చాలా మంది భక్తులు ఇబ్బంది పెడుతున్నారు. కొన్ని పురాతన గుడులు అయితే సిద్ధిలావస్థకు చేరి కూలిపోతున్నాయి. ఆ గుడులనే నమ్ముకున్న బ్రాహ్మణులు చాలా మంది వున్నారు.అలాంటిది ఆ గుడులు బాగుంటేనే పూజారులు బాగుపడతారు. కాబట్టి ప్రభుత్వం పట్టించుకోని ఆ సమస్యలను తీర్చాలి..



బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి
తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి. మీ హ‌క్కులు తెలుసుకోండి..! ఓటు బ్యాంకుగా ఉప‌యోగ‌పడుతున్నారే త‌ప్ప‌... మీ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ఏ రాజ‌కీయ పార్టీ కూడా ముందుకు రావ‌డం లేద‌నే విష‌యాన్ని గుర్తించండి. ప్ర‌భుత్వాలు మారినా.. మీ స‌మ‌స్య‌లు మాత్రం తీర‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌స్య‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో వాటిని ప‌రిష్క‌రించేందుకు ఏ ఒక్క‌రూ బాధ్య‌త‌లు తీసుకోవ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో మీ గ‌ళాన్ని వినిపించేందుకు https://www.indiaherald.com/ ముందుకు వ‌చ్చింది. బ్రాహ్మ‌ణుల స‌మ‌స్య‌లను ప్ర‌భుత్వానికి చేర‌వేసేందుకు https://www.indiaherald.com/ ప్ర‌య‌త్నిస్తోంది. దీనిలో మీ భాగ‌స్వామ్య‌మే కీల‌కం. మీ స‌మ‌స్య ఏదైనా.. ప్ర‌భుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు మేం ముందుంటాం.



మీరు చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు 8919011959 కు ఫోన్ చేయ‌డ‌మే. లేదా care@indiaherald.com  ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..!

మరింత సమాచారం తెలుసుకోండి: