ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒకే సమయంలో లక్ష ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతో నిరీక్షణ ఎదురుచూస్తున్నా నిరుద్యోగులు అందరికీ ఇది సువర్ణ అవకాశం గా మారిపోయింది. ఈ క్రమంలోనే ఎంతో మంది నిరుద్యోగులు వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షలు రాసి ఎంతో మంది ఎన్నికయ్యారు అన్న విషయం తెలిసిందే. అయితే.. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది రాష్ట్ర ప్రభుత్వం.



 ఈ క్రమంలోనే ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు  అందరికీ కూడా జీతాలు చెల్లించే విషయంలో ఇటీవల కీలక నిర్ణయం తీసుకొని కొత్త విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది ఏపీ ప్రభుత్వం. ఇప్పుడు వరకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల జీతాలు నేరుగా తన బ్యాంక్ అకౌంట్ లోకి జమ చేస్తుంది ప్రభుత్వం. కానీ ఇక నుంచి ఆయా ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లో సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.  అదే సమయంలో గ్రామ సచివాలయ ఉద్యోగులు అందరూ కూడా.. విధులకు హాజరు కాకపోయినప్పటికీ జీతాలు తీసుకుంటూ అవకతవకలకు పాల్పడుతున్నారు అన్న వాదన కూడా వినిపిస్తోన్న  నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం.



 ఏప్రిల్ నుంచి బయోమెట్రిక్ హాజరు ఆధారంగానే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అందరికీ జీతాలు చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు సచివాలయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రతి ఒక్క గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు విధులకు హాజరు కావాలని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వీధుల్లోనే ఉండాలని సూచించారు. అయితే ఉదయం విధులకు హాజరైన సమయంలో ఇక సాయంత్రం విధుల నుంచి వెళ్లిపోతున్న సమయంలో కూడా బయోమెట్రిక్ వేయాలి అంటూ సూచించింది. అంతేకాదు ప్రతిరోజూ మధ్యాహ్నం సమయంలో జరిగే స్పందన కార్యక్రమానికి కూడా అందరూ అందుబాటులో ఉండాలని సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: