ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి నిద్రలేమి సమస్య అనేది సర్వసాధారణంగా మారిపోయింది అనే విషయం తెలిసిందే. నేటితరంలో యువత ఎవరు కూడా సరైన సమయంలో నిద్రపోవడం లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా టెక్నాలజీ పెరిగిపోయిన నేపథ్యంలో అర్ధరాత్రి వరకు టీవీ ముందు కూర్చుని వివిధ కార్యక్రమాలు వీక్షించడం లేదా సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని చాటింగ్ చేయడం లేదా ఫోన్ మాట్లాడటం లాంటివి చేస్తున్నారు.  ఇక మరికొంతమంది వృత్తికి సంబంధించిన టెన్షన్తో  అర్ధరాత్రి వరకు నిద్ర పోకుండా నే ఉంటున్నారు అన్న విషయం తెలిసిందే. సరైన సమయంలో నిద్ర పోకుండా ఉండటం తో ఎన్నో ఆరోగ్య సమస్యలు దూసుకువచ్చి మీద పడి పోతున్నాయి.



 అయితే చాలామంది నిద్రపోవడానికి రాత్రి తొమ్మిది గంటల సమయంలోనే మంచం ఎక్కినప్పటికీ ఇక నిద్ర రాక ఇబ్బందులు పడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.  దీనికికారణం వారికి గతంలో ఉన్న అలవాటు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఒకవేళ ఇలా నిద్ర పట్టక పోయినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎంతో హాయి నిద్ర  పొందే అవకాశం ఉంది అని అటు నిపుణులు పలు సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు.  ముఖ్యంగా నిద్రకు ఉపక్రమించే ముందు కొన్ని రకాల ఆహార పదార్థాలు తింటే హాయిగా నిద్ర పోవచ్చు అని చెబుతున్నారు నిపుణులు.



 సరిగ్గా పడుకునే ముందు వేడి చేసిన గ్లాసు పాలలో చిటికెడు పసుపు వేసుకొని తాగడం వల్ల త్వరగా నిద్ర పట్టడానికి అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. బాదం పిస్తా లాంటి ఆహార పదార్థాలను కూడా నిద్రపోయే ముందు తింటే త్వరగా నిద్ర రావడానికి ఆస్కారం వుంటుంది. అంతేకాదు నిద్రపోయే ముందు చామంతి టీ తాగితే మనసులోని ఆందోళన మొత్తం దూరం చేసి ఇక హాయిగా నిద్ర పట్టడానికి ఉపయోగపడుతుందట. ఇక పడుకునే ముందు చెర్రీస్ తినడం వల్ల హార్మోన్లు అన్నింటినీ రిలాక్సేషన్ చేసి హాయిగా నిద్ర పట్టేందుకు తోడ్పాటు అందిస్తుందని.

మరింత సమాచారం తెలుసుకోండి: