ఇక ఈ టూర్ ప్యాకేజీలు కేవలం జగన్నాథ యాత్ర మే కాకుండా పూరి, భువనేశ్వర్, కోణార్క్ ప్రాంతాలను కూడా చుట్టేసి వచ్చేందుకు ఆఫర్ కల్పిస్తోంది. ఒకవేళ ఐ ఆర్ సి టి సి అందిస్తున్న ఈ ఆఫర్లో భాగంగా టూర్ వెళ్ళాలి అని భావించేవారు. సికింద్రాబాద్ లేదా వరంగల్, ఖమ్మం,విజయవాడ రాజమండ్రి, దువ్వాడ ప్రాంతాల్లో రైలు ఎక్కేందుకు అవకాశం ఉన్నది. ఇక తిరిగి వచ్చే క్రమంలో విశాఖపట్నం, రాజమండ్రి. విజయవాడ,ఖమ్మం వరంగల్, సికింద్రాబాద్ లలో దిగేందుకు అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం ఐ ఆర్ సి టి సి అందిస్తున్న టూర్ ప్యాకేజీ లో భాగంగా ఐదు రోజుల పాటు జగన్నాథ్ టూర్ కి వెళ్ళవచ్చు.
మార్చి 5న ఈ టూర్ ప్రారంభమౌతుంది. సికింద్రాబాద్‌లో రాత్రి 12.05 గంటలకు ట్రైన్ బయలు దేరుతుంది. టూర్ ప్యాకేజీ ధర రూ.5,250గా ఉంది. 5 ఏళ్లలోపు పిల్లలకు ఎలాంటి వసూలు చేయడం లేదు. ఒకవేళ ఐదేళ్ల వయసు పైబడినవారు అయితే మాత్రం ఫుల్ అమౌంట్ కట్టాలి. రూ.5,250 అయితే స్లీపర్ క్లాస్‌లో టికెట్ ఇస్తారు. అదే 3 టైర్ ఏసీలో ప్రయాణించాలని భావిస్తే.. రూ.6,300 చెల్లించాలి. ఇకపోతే ఫుడ్, షెల్టర్ వంటివి అన్నీ ఐఆర్‌సీటీసీనే చూసుకుంటుంది. అయితే ఈ ఫెసిలిటీలు అన్నీ షేరింగ్ బేసిస్‌పై ఉంటాయి. మార్చి 9న మీరు మళ్లీ మీ ఊరికి రిటర్న్ వస్తారు.