ఈ మధ్య కాలంలో ప్రేమ అంటే విషాదాల కు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ప్రేమించడమే పాపం గా మారిపోయింది. ప్రేమించిన వ్యక్తే  యమకింకరుడుగా మారిపోయి  ఇక ప్రేయసి ప్రాణాలు తీస్తున్న ఘటనలు ఎన్నో తెర మీదికి వస్తున్నాయి  అన్న విషయం తెలిసిందే. ఎంతో మంది యువకులు ప్రేయసి  తమకు దక్కడం లేదు అనే కారణంతో ఇక ఎవరికి దక్కకూడదని నిర్ణయించుకుని చివరికి గా ఉన్మాదులుగా  మారిపోయి..  ప్రేమించిన యువతి ప్రాణాలు తీస్తున్న ఘటనలు ఎన్నో తెర మీదికి వస్తున్నాయి  అన్న విషయం తెలిసిందే. దీంతో రోజురోజుకు ప్రేమ అనేది దారుణ ఘటన లకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతుంది.



 ఇక ఇటీవల ఇక్కడ దారుణ ఘటన వెలుగులోకి వచ్చి  స్థానికంగా కలకలం సృష్టించింది. ఎంతగానో ప్రేమించిన ప్రియురాలికి వేరే వ్యక్తితో నిశ్చితార్థం కావడం ఆ యువకుడు జీర్ణించుకోలేకపోయాడు. ఇక ప్రేయసి తనకు దక్కదు ఏమో అని మనస్తాపం చెందాడు.అంతేకాదు కోపంలో ఎలాగైనా ప్రేయసిపై పగ తీర్చుకోవాలి అనుకొని భావించాడు. ఈ క్రమంలోనే దారుణానికి పాల్పడ్డాడు. ప్రేమించిన ప్రియురాలి తో పాటు ఆమె తల్లి పై  కూడా పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశాడు. అంతటితో ఆగకుండా అతను కూడా ఆత్మాహుతికి పాల్పడ్డారు .



 ఈ దారుణ ఘటన తమిళనాడులోని వెలుగులోకి వచ్చింది..  చెన్నై కొరుక్కు పేటకు చెందిన సతీష్ డ్రైవింగ్ చేస్తూఉంటాడు. అదే ప్రాంతానికి చెందిన రజిత తో ఏడేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. అయితే వీరి ప్రేమకు రజిత తల్లీ నిరాకరించింది. ఎవరికి తెలియకుండా రజిత కు వేరే వ్యక్తితో నిశ్చితార్థం కూడా జరిపించింది.  ఇక ఈ విషయం తెలుసుకున్న సతీష్ ఎంతగానో కుంగిపోయాడు. ఈ క్రమంలోనే తనకు దక్కనిది ఎవ్వరికీ దక్క కూడదు అని భావించి ప్రియురాలిపై పగ తీర్చుకోవాలి అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే రజిత ఇంటికి వెళ్లి గొడవ చేసి తల్లి కుమార్తే  పై కిరోసిన్ పోసి తన పైన కూడా పోసుకొని నిప్పంటించాడు.  ముగ్గురు కేకలు విన్న స్థానికులు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో వారు  సమయానికి ముగ్గురు మృతి చెందారు. కేసు నమోదు  చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: