ఈ నేపథ్యంలోనే వైసీపీ నుంచి ఆయనను బహిష్కరించాలంటూ.. వంగవీటి రాధా డిమాండ్ చేశారు. ఇక, కొన్నాళ్లు ఆయనను పక్కన పెట్టారు. అయితే.. రాధా ఆశించిన విధంగా పార్టీకి సేవ చేయలేక పోయారు. దీంతో రాధాను పక్కన పెట్టి.. మళ్లీ గౌతం రెడ్డిని పార్టీలోకి తీసుకున్నారు. ఇక, ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్‌కు చైర్మన్ పదవిని గౌతం రెడ్డికి ఇచ్చారు. మరోవైపు.. ఈయనపై విమర్శలు చేసిన రాధా.. ఏకంగా పార్టీకి దూరమయ్యారు. సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని రెడ్డి సామాజిక వర్గాన్ని వైసీపీకి చేరువ చేయడంలో గౌతంరెడ్డి దూకుడుగా వ్యవహరించి మంచి మార్కులు సంపాయించారు.
ఇక, ఇటీవల కాలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కొన్ని టీవీ చానెళ్లను నిషేదిస్తూ.. ఎం ఎస్ వోలకు ఆదేశాలివ్వడం కూడా గౌతంరెడ్డికి మంచి మార్కులు వేసేలా చేసింది. అయితే.. ఆయన ఊపు అంతా కూడా విజయవాడంలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల పై ఉంది. ఈ ఎన్నికలు వచ్చే నెలలో జరగనున్నాయి. ఈ క్రమంలో ఆయా ఎన్నికల్లో మేయర్ పీఠంపై గౌతంరెడ్డి కన్నేశారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వైసీపీకి ఇక్కడ మేయర్ స్థానం కైవసం చేసుకునే వ్యక్తి ఎవరూ లేకుండా పోయారు.
పైగా ఎన్నికల సంఘం ఈ స్థానాన్ని జనరల్ మహిళకు కేటాయించింది. ఈ నేపథ్యంలో గౌతం రెడ్డి తన కుమార్తె డాక్టర్ పూనూరు లిఖితను రంగంలోకి తీసుకువచ్చారు. ఇటీవలే ఆమెను సీఎం జగన్‌కు సైతం పరిచయం చేశారు. అయితే.. మేయర్ పదవిపై హామీ మాత్రం లభించలేదు. కానీ, పూనూరు మాత్రం ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు మంత్రి సతీమణి, మరోవైపు నగర పార్టీ చీఫ్ సతీమణి పేర్లు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో లిఖిత పేరుకు జగన్ జై కొడతారా? లేదా? చూడాలి.