మెగామేనల్లుడు
వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న
సినిమా ఉప్పెన. ఈ సినిమాకు
సుకుమార్ దగ్గర పని చేసిన అసిస్టెంట్ డైరెకర్ బుచ్చిబాబు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో క్రితి శెట్టి
హీరోయిన్ గా నటించింది. ఈ
సినిమా విడుదలకు ముందే ఎంతో పాపులర్ అయింది.సినిమాలోని పాటలు సూపర్ హిట్ అవ్వడంతోనే ఈ సినిమాకు ఇంత క్రేజ్ వచ్చిందని చెప్పవచ్చు మరోవైపు
సినిమా ట్రైలర్ కూడా ఆసక్తి రేపేలా ఉంది. ఈ
సినిమా ఫిబ్రవరి 12 న ప్రేక్షకుల ముందుకు ముందుకు రానుంది. ఇదిలా ఉండగా ఈ
సినిమా దర్శకుడు బుచ్చిబాబు
సినిమా గురించి..ఆయన గురువు
సుకుమార్ గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
సుకుమార్ ఎవరో కాదని తనకు
స్కూల్ లో పాటలు చెప్పిన లెక్కల మాస్టరే
సుకుమార్ అని చెప్పాడు. తనకు సినిమాలపై ఉన్న ఆసక్తి తోనే
డిగ్రీ పూర్తయ్యాక ఎంబీఏ పెరు చెప్పి
హైదరాబాద్ వచ్చానని అన్నారు.
సుకుమార్ జగడం
సినిమా షూటింగ్ లో ఉండగా వెళ్లి అడిగితే ముందు ఎంబీఏ పూర్తి చేసి తరువాత రమ్మని చెప్పారట. దాంతో బుచ్చిబాబు ఎంబీఏ పూర్తి చేసి మళ్ళీ
సుకుమార్ ముందుకు వచ్చి నిలుచున్నారట. ఇక
సుకుమార్ బుచ్చిబాబు ఇంట్రెస్ట్ చూసి అసిస్టెంట్ గా పెట్టుకున్నారట. అంతే కాకుండా
సుకుమార్ చాలా మంచి వాడని...జేబులో డబ్బులు తీసుకున్నా అడగాల్సిన అవసరం లేదని అన్నారు. కొత్త టాలెంట్ ను
సుకుమార్ భాగా ఎంకరేజ్ చేస్తారని చెప్పాడు. కాగా యాంకర్ ఓ సినిమాలో
సుకుమార్ కు మీరు హెల్ప్ చేశారట నిజమేనా అని ప్రశ్నించగా..సుకుమార్ కు ఎవ్వరి సహాయం అవసరం లేదని ఆయనే అద్భుతంగా తీయగలరని చెప్పారు. ఇక ఈ
సినిమా కథ బుచ్చిబాబు రంగస్థలం
సినిమా కోసం పని చేస్తున్న సమయంలో మసులో తట్టిందట. అప్పటి నుండి బుచ్చిబాబు 6నెలల పాటు ఉప్పెన కథను డెవలప్ చేసుకున్నారట.