మొన్నటి వరకు ప్రపంచ దేశాలు భారత్ను ఎంతగానో చిన్న చూపు చూశాయి అన్న విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం భారత్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న తీరు చూసి ప్రస్తుతం ప్రపంచ దేశాలు సైతం ఆశ్చర్య పోతున్నాయి. అంతేకాదు ఇండియాను ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు సాగుతున్నాయి అగ్రరాజ్యాలు.  ప్రతి విషయంలో కూడా ప్రస్తుతం భారత్ ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో కరోనా కట్టడి  విషయంలో కూడా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది భారత్.  కేవలం భారత జనాభాలో సగం జనాభా కంటే తక్కువగా ఉండి.. అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉండి కూడా అగ్రరాజ్యమైన అమెరికా లో కరోనా వైరస్ విజృంభిస్తే 135 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో మాత్రం కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో ప్రభుత్వం విజయం సాధించింది.


 ఇలా కరోనా వైరస్ ఈ విషయంలో ఎప్పటికప్పుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న భారత్ ప్రపంచ దేశాలు అందరికి ఆదర్శంగా నిలుస్తుంది.  ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలు అన్ని కూడా భారత్ పై ఆధారపడే విధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతుంది భారత్. ఇటీవలే భారత్లో వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యి శరవేగంగా జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ముందుగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కి భారత్లో వ్యాక్సిన్ అందజేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇక ఈ ప్రక్రియ చాలా వేగంగా కొనసాగుతోంది.



 ఇక ప్రపంచ దేశాల కంటే ఎక్కువగానే ప్రజలకు వ్యాక్సిన్  అందిస్తుంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే తక్కువ రోజుల్లో అతి ఎక్కువ టీకాలు పంపిణీ చేసిన దేశంగా రికార్డు సృష్టించింది భారత్. దేశంలో ఇప్పటి వరకు 60 లక్షలకు పైగా టీకాలు పంపిణీ చేసింది. భారత్ లో  కేవలం ఇరవై నాలుగు రోజుల్లోనే ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది. అగ్రరాజ్యమైన అమెరికా 26 రోజుల వ్యవధిలో 60 లక్షల ఎకరాలు పంపిణీ చేసింది. భారత్. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రపంచ దేశాలకు వాక్సిన్ అందించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తోంది భారత్. ప్రస్తుతం వాక్సిన్ ప్రపంచ దేశాలకు పంపిణీ చేయడంలో దూసుకెళుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: