ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి అంతకంతకూ పెరిగిపోతోంది అనే విషయం తెలిసిందే. స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల నగారా మోగిన నాటి నుంచి అంతకంతకు ఎన్నికల వేడి రాజుకుంది. ప్రతిపక్ష అధికార పార్టీల అభ్యర్థుల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.  అయితే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నాలుగు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నిర్ణయించింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత పోలింగ్ జరిగింది. ఈ మొదటి విడత పోలింగ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగింది అని చెప్పాలి. ఇక మొదటి  విడత పోలింగ్ లో మొన్నటి వరకు ప్రచారం నిర్వహించిన అభ్యర్థుల భవితవ్యం తేలిపోయింది.



సాధారణ ఎన్నికల తర్వాత గెలుపు ఓటములు సహజం అన్న విషయం తెలిసిందే. అయితే  ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల మధ్య భారీ తేడాతో ఓటమి చవిచూసిన సమయంలో అభ్యర్థులు కాస్త తక్కువగా బాధపడుతూ ఉంటారు. కానీ కొన్నిసార్లు ఒక్క ఓటు కూడా ఏకంగా అభ్యర్థుల భవితవ్యాన్ని మారుస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసింది. ఒక్క ఓటు ద్వారా గెలిచిన అభ్యర్థులు కొంతమంది అయితే.. ఒకే ఒక్క ఓటుతో ఓడిపోయి చివరికి నిరాశ చెందిన అభ్యర్థులు మరికొంతమంది.  ఇక ఇటీవల ఏపీలో పంచాయతీ ఎన్నికలు మొదటి విడత పోలింగ్ లో భాగంగా ఇలాంటి తరహా ఘటనలు చోటుచేసుకున్నాయి


 కేవలం ఒకే ఒక్క ఓటు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చింది. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కందలం పాడు సర్పంచిగా బైరెడ్డి నాగరాజు గెలిచారు. కేవలం ఒక్క ఓటు తేడాతో.. వైసిపి మద్దతుదారు బైరెడ్డి నాగరాజు తన ప్రత్యర్థులపై విజయం సాధించారు. ఈ క్రమంలోనే మరోసారి రీకౌంటింగ్ చేయాలి అని ప్రత్యర్థి అభ్యర్థులు పట్టుబట్టారు. ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ ప్రక్రియ వేగంగా జరిగగా  ఇక కౌంటింగ్ ప్రక్రియ ముగియగానే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: