ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతోంది. మొదటి విడత ఎన్నికల గట్టం ముగిసింది. ఈరోజు రెండో విడత పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో నేతలు , కార్యకర్తలు మాటల దాడికి దిగుతున్నారు. నువ్వెంత, నీ పార్టీ గొప్పెంత అంటూ ఒకరిపై మరొకరు కాలు రువ్వుతున్నారు. అధికార పార్టీకి మొదటి విడత ఎన్నికలు అనుకూలంగా వచ్చిన సంగతి తెలిసిందే.. ఈరోజు జరగనున్న ఎన్నికలు కూడా అనుకూలంగా వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక టీడీపీ నేతల్లో కూడా అదే ధోరణి కనపడుతుంది.



ఇది ఇలా ఉండగా..తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో
వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడారు.2,640 పంచాయతీల్లో తమ మద్దతుదారులు గెలిచారని ఇది తప్పని ఎవరైనా నిరూపించండి అంటూ టీడీపీ నేతలకు సవాల్‌  విసిరారు.టీడీపీ చెప్పిన లెక్కలను తాము ప్రశ్నించామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. 1,055 స్థానాలు ఎక్కడ గెలిచారో చెప్పమని అడిగామని తెలిపారు. మిగిలిన 500 ఎక్కడ ఉన్నాయో టీడీపీ చెప్పాలని ప్రశ్నించారు. తాము నిరూపిస్తామనేసరికి చంద్రబాబు మాట మార్చాడని విరుచుకుపడ్డాడు.



ఏది నిజం..? గెలుపా.. ఎన్నికల సంఘం వైఫల్యమా..? సందేహాలు వ్యక్తం చేశారు. ఆయనకున్న అధికారాలను విచక్షణతో వాడాల్సింది పోయి ఏకపక్షంగా వ్యవహరించారని సజ్జల ఆరోపించారు. అధికార పక్షానికే కాళ్లూచేతులూ కట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. సొంత జిల్లాలో గెలవడం కోసం అడ్డదారులు తొక్కారు. కొందరు గుళ్ళకు వెళ్లి మొక్కులు కూడా మోక్కారు అంటూ సజ్జల ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో పరువుపోవడంతో ఇప్పుడు ఉన్నట్లుండి ఎన్నికల సంఘంపై దాడి మొదలుపెట్టారని సజ్జల రామకృష్ణారెడ్డి  ఆరోపించారు. మొదటి నుంచి బాబు గారికి తిన్నంటి వాసాలను లెక్కపెట్టడం అలవాటే అని మండిపడ్డారు.వచ్చే ఎన్నికల్లో కూడా తమ పార్టీ విజయదుందుభి మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతే రెండు మాటలు మాట్లాడవచ్చు.. మరీ ఇంతగా అబద్ధాలు చెప్పడం సరికాదని చంద్రబాబుపై ధ్వజమెత్తారు...ఇకపోతే ఈరోజు రెండో విడత పోలింగ్ ఆసక్తిగా కొనసాగుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: