ప్రస్తుతం టెక్నాలజీ అంతకంతకూ పెరిగిపోతోంది. ఇక మనిషి జీవన శైలిలో కూడా ఎంతో మార్పు వస్తుంది. ప్రతి ఒక్కరు  అధునాతన నాగరికత లోకి అడుగు పెడుతూ.. ఇక డబ్బు వెంట పరుగులు పెడుతున్నారు. అయితే రోజురోజుకు టెక్నాలజీ పెరిగిపోవడమే కాదు అటు రోజురోజుకీ ప్రజల రోగాలు కూడా పెరిగిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరి  జీవనశైలి కూడా మారిపోతూ ఉండటం తో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు దూసుకువచ్చి మీద పడిపోతున్నాయి.  నేటి రోజుల్లో ఎంతో మంది వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అన్న విషయం తెలిసిందే.



 ప్రస్తుతం ఎంతోమంది ఆరోగ్యంపై అంతగా దృష్టి పెట్టకపోవడంతో..  ఇలా వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఒత్తిడి పెరిగి పోవడం వివిధ రకాల అలవాట్ల కారణంగా రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారు రోజురోజుకు పెరిగి పోతున్నారూ అన్న విషయం తెలిసిందే. ఇక మరి కొంత మంది తమకు రక్తపోటు ఉన్నప్పటికీ ఇక దీనిపై సరైన అవగాహన లేకపోవడంతో.. వైద్యులను సంప్రదించకుండా సరికొత్త సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఇంతకీ అధిక రక్తపోటు లక్షణాలు ఏమిటి అనేది మాత్రం చాలామందికి తెలియదు.




 తరచూ తీవ్రమైన తలనొప్పి వస్తూ ఉంటే అది అధిక రక్తపోటు లక్షణాలే అని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా దృష్టి సమస్య వచ్చింది అంటే ఇక అధిక రక్తపోటు కి కారణం కావచ్చు అని చెబుతున్నారు నిపుణులు. అంతేకాకుండా శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది లాంటివి జరిగితే రక్తపోటుకు కారణమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఎప్పుడూ అలసటగా ఉండటం..  చాతిలో నొప్పి రావడం వంటి లక్షణాలు కూడా రక్త పోటుకు కారణం అవుతాయట. అంతేకాకుండా మూత్రంలో రక్తం రావడం.. చాతి మెడ చెవులలో నొప్పిగా ఉండడం లాంటి లక్షణాలు మీలో ఉంటే అవి అధిక రక్తపోటు లక్షణాలు అని వెంటనే వైద్యున్ని  సంప్రదించడం ఎంతో మేలు అని నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: