రాజ‌కీయాల్లో కాపు సామాజిక వ‌ర్గానికి  ప్రాధాన్యం ఉన్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా తూర్పుగోదావ‌రి జిల్లాలోని కాపుల‌కు రాజ‌కీయ పార్టీలు పెద్ద‌పీట వేశాయి. గ‌తంలో టీడీపీ, వైసీపీలు కాపు నేత‌ల‌ను ఆద‌రిం చాయి. వారి నుంచి స‌ల‌హాలు కూడా తీసుకుని.. విధాన ప‌ర‌మైన నిర్ణ‌యాల్లో భాగ‌స్వామ్యం క‌ల్పించారు. వీరిలో జ్యోతుల నెహ్రూ, చిన‌రాజ‌ప్ప‌.. స‌హా అనేక మంది ఉన్నారు. అయితే.. రాను రాను.. వీరికి ప్రాధా న్యం త‌గ్గుతోంది.

గ‌త టీడీపీ పాల‌న‌లో చ‌క్రం తిప్పిన రాజ‌ప్ప‌.. ఇప్పుడు టార్గెట్ అవుతున్నారు. ఆయ‌న ఏకంగా కీల‌క‌మైన హోం మంత్రి త్వ శాఖ‌ను నిర్వ‌ర్తించారు. అటు డిప్యూటీ సీఎంగాను ఉన్నారు. అలాంటి నేత‌కు ఇప్పుడు ఇటు పార్టీలోను, అటు నియోక‌వ‌ర్గంలోనూ ప‌ట్టించుకునేవారు క‌రువ‌వుతున్నారు. ఇక‌, జ్యోతుల నెహ్రూ. వైసీపీ నుంచి టీడీపీలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. యాక్టివ్‌గా ఉన్న‌ప్ప‌టికీ.. త‌ర్వాత మాత్రం.. ఆయ‌న జాడ ఎక్క‌డా క‌నిపించ డం లేదు. అంతేకాదు.. విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాల విష‌యంలోనూ ఆయ‌నను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌డం లేదు. ఇది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

జ్యోతుల రాజ‌కీయ శ‌కం ముగిసిన‌ట్టే క‌నిపిస్తోంది. కాపు సామాజిక వ‌ర్గం నుంచి ఇప్పుడు ఉన్న నాయ‌కుల్లో చాలా త‌క్కువ మంది మాత్ర‌మే యాక్టివ్‌గా ఉన్నారు. అయితే.. ఇప్పుడు వారు కూడా సైలెంట్ అయిపోతే.. కాపు సామాజిక వ‌ర్గం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకునేవారేరీ..? అనే సందేహాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. ఉన్న సీనియ‌ర్లు త‌మ‌కు ఏదైనా మార్గ‌ద‌ర్శ‌నం చేస్తార‌ని.. యువత భావిస్తున్న‌ది. అయితే.. సీనియ‌ర్లు సైలెంట్ అయిపోవ‌డంతో యువ‌త‌ను న‌డిపించే వారు క‌నిపించ‌డం లేదు. దీంతో కాపు యువ‌త గ‌గ్గోలు పెడుతోంది.

కాపు సోద‌రులారా.. రండి.. ఉద్య‌మించండి..!

రాష్ట్రంలో కాపు సోద‌రులు.. రాజ‌కీయ పార్టీల‌కు ఆట‌వ‌స్తువుగా మారిపోయార‌న‌డంలో సందేహం లేదు. కాపుల సుదీర్ఘ డిమాండ్‌గా ఉన్న రిజ‌ర్వేష‌న్ అంశాన్ని కొన్ని పార్టీలు ఓటు బ్యాంకు చేసుకుంటే.. మ‌రికొన్ని పార్టీలు ఉదాశీనంగా తీసుకున్నాయి. ఫ‌లితంగా కాపులు ఓటు బ్యాంకుగా ఉప‌యోగ‌ప‌డుతున్న‌ప్ప‌టికీ.. వారి నిజ‌మైన కోరిక‌లు.. డిమాండ్లు.. ఎక్క‌డివ‌క్క‌డే ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో త‌న గ‌ళం ద్వారా కాపుల స‌మ‌స్య‌లను, డిమాండ్లను అటు ప్ర‌భుత్వానికి, ఇటు రాజ‌కీయ నేత‌ల‌కు వినిపించేందుకు న‌డుం బిగించింది  https://www.indiaherald.com/  కాపు సామాజిక వ‌ర్గం స‌మ‌స్య‌ల‌ను వెలుగులోకి తీసుకువ‌చ్చేందుకు, వారికి అన్ని విధాలా అండ‌గా నిలిచేందుకు  https://www.indiaherald.com/  నిర్ణ‌యించింది.

కాపు సోద‌రులు చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు 8919011959 కు ఫోన్ చేయ‌డ‌మే. లేదా care@indiaherald.com ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..! మీ త‌ర‌ఫున మీవాయిస్‌ను https://www.indiaherald.com/వినిపిస్తుంది. మీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో https://www.indiaherald.com/ సైనికుడై పోరాడుతుంది! ఈ ఉద్య‌మంలో ప్ర‌తి కాపు సోద‌ర‌, సోద‌రీమ‌ణుల‌కు భాగ‌స్వామ్యం క‌ల్పిస్తోంది ​https://www.indiaherald.com/​​​

మరింత సమాచారం తెలుసుకోండి: