ఏపీ పరిపాలన రాజధానిని
విశాఖ కు తరలించాలని
వైసిపి ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని న్యాయపరమైన చిక్కులు అడ్డంకులు ఎదురవడంతో ఈ ప్రక్రియలో ఆలస్యం జరిగింది. అయితే
వైసీపీ సర్కార్ మాత్రం విశాఖను కచ్చితంగా పరిపాలన రాజధానిగా మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే
ముఖ్యమంత్రి జగన్ నేడు
విశాఖ పర్యటనకు వెళ్లారని తెలుస్తోంది. ఈ అంశంపై శారదా పీఠాధిపతి స్వరూపానరేంద్ర తో
జగన్ చర్చలు జరిపారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శ్రీ శారదాపీఠం వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం కాగా తొలిరోజు కార్యక్రమానికి
ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా
జగన్ కు శరదాపీటాదిపతి స్వరూపానందేంద్ర కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో హిందూ ధార్మిక పరిశత్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. హిందు ధార్మిక పరిషత్ ను త్వరగా ఏర్పాటు చేయాలని
జగన్ కు సలహా ఇచ్చారు. సాధ్యమైనంత త్వరలో దీనిపై నిర్ణయం తీసుకోవడం మంచిదని చెప్పారు. అంతే కాకుండా రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న వరుస దాడులపై కూడా
జగన్, స్వరూపానరేంద్ర చరించారట. ఆలయాలపై జరుగుతున్న దాడులపై, సమస్యలపై తొందరలోనే పీఠాధిపతుల సమావేశం ఎర్పాటు చేసి వారి సలహాలు సూచనలు తీసుకోవాలని
జగన్ కు సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా వారసత్వం అర్చకత్వం పై కూడా వీరిద్దరూ చర్చించినట్టు తెలుసుతోంది.
వైసిపి ఆధికారంలోకి వచ్చాక వారసత్వ అర్చకత్వం పై చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని..అయితే అది పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని స్వరూపానందేద్ర వెల్లడించారు. అంతే కాకుండా దానిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని స్వరూపా నందేంద్ర
ముఖ్యమంత్రి జగన్ కు వెల్లడించారు. అయితే దీనిపై స్పందించాలని పేర్కొన్నట్టు తెల్సుతోంది. ఇక స్వరూపానందేంద్ర ఇచ్చిన అన్ని సలహాలకు
జగన్ సానుకూలంగానే స్పందించినట్టు సమాచారం. ఇక ఆ సూచనలను
ముఖ్యమంత్రి ఆచరణలో పెడతారా చూడాలి.