జిల్లాలో ఎటువంటి ఎన్నికలు వచ్చినా కూడా కొన్ని ఇలాకాలో పై చేయి ఒక పార్టీకే ఉంటుంది. ఆ పార్టీకి నేతల మద్దతు తో పాటుగా ప్రజల ఆదరణ కూడా ఉంది. అందుకే రాజకీయాలు ఇక్కడ రసవత్తరంగా ఉంటాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని సార్లు వివిధ రకాల ఎన్నికలు జరిగినా కూడా వైసీపీ పై చేయిగా జెండాను ఎగురవేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. మూడు విడతలు పూర్తి చేసుకున్న ఎన్నికలలో వైసీపీ పార్టీ హవాను కొనసాగిస్తోంది. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవుతుంది.
నాలుగో విడత ఎన్నికలు రేపు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల కమీషన్ అన్నీ సిద్ధం చేసింది. ఈ ఎన్నికలు పూర్తి కాకుండానే ఇప్పుడు మరో ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల సంఘం వ్యూహాలు రచిస్తున్నారు..జిల్లాలోని సీఎం ఇలాకాలో పులివెందులలో ఎన్నికల వేడి పెరుగుతుంది. రాజకీయాలు పుట్టింది అక్కడే కావునా అందరి కన్ను ఈ ఎన్నికల పై పడింది. అధికార పార్టీ వైసీపీ పార్టీ అక్కడ అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా అదే పార్టీ హవాను కొనసాగిస్తోంది అనే వార్తలు జిల్లా వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఆ ఎన్నికలో ఏ పార్టీ ముందంజలో ఉంటుందో చూడాలి..