ఇక, రెండో దశ ఎన్నికల్లోనే చిన్నరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఎన్నికలు జరిగాయి. ఈ క్రమంలో కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు ప్రజలు జోరుగా బహుమతులు పంచారు. భారీ ఎత్తున ప్రజలకు చేరువయ్యారు. వీరిలో కొందరు గెలిచారు. చాలా మంది ఓడిపోయారు. అయితే.. వీరంతా తాము ప్రజలకు పంచిన గిఫ్టులకు కాను.. భారీ ఎత్తున ఖర్చు చేశారు. మా మాజీ మంత్రిగారు ఉన్నారనే ధీమాతో వీరంతా ప్రజలకు పెద్ద పెద్ద గిఫ్టులనే ఇచ్చారు.
దీనికి గాను.. అప్పులు చేసిన వారు కొందరు ఉన్నారు. మరికొందరు తమ ఇళ్ల స్థలాలను తాకట్టు పెట్టి మరీ .. డబ్బులు తెచ్చుకున్నారు. కొందరు చేబదుళ్లు పుచ్చుకున్నారట. తీరా.. ఎన్నికల్లో ఇలా ఖర్చు చేసిన వారిలో చాలా మంది ఓడిపోవడంతో వెంటనే మాజీ మంత్రిగారి ఇంటికి వెళ్లి లెక్కలు సమర్పించారు. లెక్కలన్నీ పరిశీలించిన తర్వాత.. సుమారు 50 లక్షల వరకు తేలింది. దీంతో మంత్రి గారు రేపు ఇస్తాను రమ్మన్నారట. ఇక, అప్పటి నుంచి ఆయన అడ్రస్ వీరికి చిక్కడం లేదు. అయ్యగారు.. హైదరాబాద్ వెళ్లారని పీఏ చెబుతున్నాడు. కానీ, ఆయన హైదరాబాద్‌లో కూడా లేరట. దీంతో ఇప్పుడు వీరంతా లబోదిబో మంటున్నారు.