ఉత్తరాంధ్రలో, ఏజెన్సీలో కూడా గెలిచామని చెప్తున్న చంద్రబాబు ఎక్కడ గెలిచారో నిరూపించాలన్నారు. అంతేకాదు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ముఖ్య మంత్రి జగన్ పట్టించుకోవడం లేదు అంటూ నోటికి వచ్చినట్లు అన్నాడు.ఇలాంటి మాటలు అనే ముందు కొద్దిగా ఆలోచించాలన్నారు.టీడీపీ హయాంలోనే కదా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అంకురార్పణ జరిగిందని, అప్పుడేందుకు మీరు మాట్లాడలేదని మండిపడ్డారు. కనీసం ఇప్పుడైనా కేంద్రానికి లేఖ రాసే ధైర్యం ఎందుకు చేయడం లేదని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కావడం చంద్రబాబుకు ఇష్టమేనని, అందుకే ఆయన హయాంలో దీనిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని బొత్స పేర్కొన్నారు..
అలాగే డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ.. తన సొంత నియోజకవర్గమైన కుప్పంలోనే చంద్రబాబు గెలవలేని పరిస్థితి వచ్చిందని ఎద్దెవా చేశారు. ప్రజలు చంద్రబాబును తిరస్కరించారని, ఓటమికి నైతిక భాధ్యత వహిస్తూ బాబు రాజకీయాలకు దూరంగా ఉండటమనేది చేయాలి.. లేదా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు..సొంత నియోజకవర్గమైన కుప్పంలోనే చంద్రబాబు గెలవలేని పరిస్థితి వచ్చిందని ఎద్దెవా చేశారు. ప్రజలు చంద్రబాబును తిరస్కరించారని, ఓటమికి నైతిక భాధ్యత వహిస్తూ బాబు రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు లాంటి నాయకత్వం అవసరమా అని తెలుగుదేశం నాయకులు ఆలోచించుకోవాలన్నారు.. ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం చేస్తున్నారు అంటూ అన్నారు..