గత కొన్ని రోజులుగా పరీక్షలకు విద్యార్థులు హాజరు అవుతున్నారు. కాగా, ఒక విద్యార్థిని మాత్రం అందుకు విచిత్రంగా చేసింది. పరీక్ష రాసేందుకు వెళ్లి మూడు రోజులు తిరిగి రాలేదు.. నాలుగో రోజు పెళ్లి చేసుకొని వచ్చి తల్లి దండ్రులకు షాక్ ఇచ్చింది. ఈ ఘటన రాజస్థాన్ జొద్ పూరు లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. 2016లో మొబైల్ ఫోన్‌కు మిస్ కాల్ వచ్చింది. అలా నితీశ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. నాలుగేండ్ల పాటు ప్రేమించుకున్న వీరి పెండ్లికి ఇరు కుటుంబాలు నిరాకరించాయి. దీంతో వారే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని పోలీసుల సహాయం కోరారు.
ఇద్దరు మేజర్లు కావడంతో వీరి ప్రేమ వివాహానికి పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయలేదు.ఈ నేపథ్యంలో బుధవారం పరీక్ష రాసేందుకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పిన గౌరి పరీక్ష కేంద్రానికి వెళ్లింది.పరీక్ష రాయలేనందుకు గౌరికి ఏ మాత్రం బాధ లేదు. తాను ప్రేమలో పాస్ అయ్యానని, వచ్చే ఏడాది పరీక్షను రాస్తానని ఆమె చెప్పింది. మరోవైపు వీరి పెండ్లి విషయాన్ని పోలీసులు ఇరు కుటుంబాలకు తెలిపారు. మేజర్లు కావడంతో వారి ఇష్ట ప్రకారం పెండ్లి చేసుకున్నారని నచ్చజెప్పారు. దీంతో గౌరి తాను పెండ్లాడిన ప్రియుడు నితీశ్‌ను తీసుకుని తన ఇంటికి వెళ్లింది...ఇలాంటి ఘటనే బీహార్ లో కూడా వెలుగు చూడటం గమనార్హం.. ఈ వరుస పెళ్ళిళ్ళు ఎంటో అంటూ నెటిజన్లు ఎద్దేవా చేశారు..