ఈ మధ్య కాలంలో తెర మీదికి వస్తున్న కొన్ని ఘటనలు చూస్తుంటే మనుషుల్లో మానవత్వం ఉందా అన్న అనుమానం రాకమానదు. ఎంతోమంది సాటి మనుషుల విషయంలో కనీసం జాలి దయ లేకుండా దారుణంగా ప్రాణాలు తీస్తున్న ఘటనలు ఎన్నో తెర మీదికి వస్తున్నాయి  అన్న విషయం తెలిసిందే. ఏకంగా సొంత వారి ప్రాణాలను సైతం పైశాచికంగా తీసేస్తున్నారు ఎంతోమంది. వెరసి రోజురోజుకు సభ్యసమాజంలో ఇక సొంతవారి నుంచి కూడా ప్రాణభయం ఉంది అని తెలియడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రోజురోజుకు ఎన్నో దారుణ ఘటనలు తెరమీదికి వస్తూనే ఉన్నాయి అనే విషయం తెలిసిందే.



 ఇకపోతే ఇప్పటికే ఆడపిల్ల జీవితం ప్రశ్నార్థకం గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఎంతో మంది కామాంధులు ఆడపిల్ల కనిపిస్తే చాలు అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో తెరమీదికి వస్తూ ఉంటే మరోవైపు ప్రేమోన్మాదులు కూడా రెచ్చి పోతూ ఉండడంతో ఆడపిల్లలకు అడుగడుగున ఆపద ఎదురవుతూనే ఉంది.  ఇలా రోజురోజుకు ఆడపిల్ల జీవితం ప్రశ్నార్థకంగా మారిపోతోంది. ఈ మధ్యకాలంలో ఎంతోమంది ప్రేమోన్మాదులు రెచ్చిపోయి  ప్రేమను అంగీకరించలేదని  లేదా పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది అని ఏదో ఒక కారణంతో  చివరికి దారుణంగా యువతులను ప్రాణాలు తీసేందుకు ప్రయత్నిస్తున్న ఘటనలు  తెర మీదకు వస్తున్నాయి.  ఇక్కడ ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది



 పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది అనే కారణంతో యువతిని రైలు కింద తోసేందుకు ప్రయత్నించాడు యువకుడు. ముంబైలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. సుమెది  జాదవ్ అనే వ్యక్తి మద్యానికి బానిస కావడంతో యువతి అతన్ని దూరం పెట్టింది. ఈ క్రమంలోనే అప్పటి నుంచి పెళ్లి చేసుకోవాలంటూ వేధింపులు మొదలుపెట్టాడు యువకుడు. అయితే ఇటీవలే అంతే రైల్వేస్టేషన్లో తల్లితో కలిసి రైలు ఎక్కేందుకు యువతి వెళ్లగా  అక్కడికి చేరుకున్న  యువకుడు రైలు కిందకి తోసేశాడు. ఈ క్రమంలోనే అప్రమత్తమైన పోలీసులు యువతిని కాపాడారు ఇక యువతి తలకు బలమైన గాయం అయినట్లు తెలుస్తుంది ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: