సాధారణంగా విద్యార్థులు అన్న తర్వాత అల్లరి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే విద్యార్థులు అల్లరి చేస్తున్న సమయంలో ఇక ఉపాధ్యాయులు కొన్ని కొన్ని సార్లు మందలిస్తూ ఉంటారు.  అప్పటికి వినకపోతే కొన్ని కొన్ని సార్లు బెత్తానికి  పని  చెబుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే అప్పట్లో అలా విద్యార్థులను బెత్తం తో  కొడితే తల్లిదండ్రులు ఏమనేవారు కాదు కానీ ఇప్పుడు మాత్రం  విద్యార్థులను మందలించడం వరకు ఓకే కానీ ఇక కొట్టడం లాంటివి చేస్తే మాత్రం ఏకంగా ఉపాధ్యాయులను శిక్షలు అనుభవించే పరిస్థితి ఉంది. అయినప్పటికీ కొంతమంది ఉపాధ్యాయులు రెచ్చిపోయి మరీ విద్యార్థులపై దారుణంగా దాడి చేస్తున్న ఘటనలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి అనే విషయం తెలిసిందే.



 సాధారణంగా వివాహమైన తర్వాత ఇక హాస్టల్ లో ఉన్న విద్యార్థులు అందరూ బాగా చదువు కునే విధంగా పౌష్టికాహారం అందే  విధంగా అన్ని  బాగోగులు చూసుకోవాలి అన్న విషయం తెలిసిందే..  విద్యార్థులు ఏదైనా తప్పు చేసినప్పుడు వారిని మండలించటం  లాంటివి కూడా చేయాలి.  ఇక్కడ ఒక వార్డెన్  మాత్రం మందలించడం వరకు ఆగలేదు రెచ్చిపోయాడు. కానీ చివరికి 11 లక్షల ఫైన్ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కేవలం మందలించడంతో మాత్రమే ఆగకుండా చేయి చేసుకోవడంతో విద్యార్థి కళ్ళు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంది.



 విద్యార్థి కన్ను పోయేలా కొట్టిన ఘటనలో ఏకంగా భారీ జరిమానా విధించారు అధికారులు. మహబూబాబాద్ జిల్లా లోని ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థిని.. వార్డెన్ దారుణంగా కొట్టాడు.. ఈ క్రమంలోనే ఆ విద్యార్థి ఏకంగా కంటిచూపు కోల్పోయాడు అయితే స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదు. దీంతో బాధిత కుటుంబం తెలంగాణ కన్స్యూమర్ ఫోరం ఆశ్రయించగా ఇక ఇరువురికి కౌన్సిలింగ్ నిర్వహించి ఇక 11 లక్షల 50 వేలు జరిమానా చెల్లించాలంటూ పాఠశాల యాజమాన్యానికి తెలిపింది. దీంతో భారీ మొత్తంలో జరిమానా పాఠశాల యాజమాన్యం చెల్లించక తప్పలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: