ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నూ ఇక్కడ జనసేన సత్తా చాటింది. డివిజన్లో ఏకంగా 30 పంచాయతీలు జనసేన కైవసం చేసుకుంది. ఇప్పుడు జరిగే మునిసిపల్ ఎన్నికల్లో కూడా నరసాపురంలో వైసీపీ వర్సెస్ జనసేన మధ్యే పుర పోరు ఉంటుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే ఇక్కడ టీడీపీ మరో సారి మూడో స్థానంతో సరి పెట్టు కోక తప్పదు.
పైగా నరసాపురం పవన్ కళ్యాణ్ కు సొంత నియోజకవర్గం. ఇక్కడ కాపు ల ఓటింగ్ తో పాటు.. పవన్ కళ్యాణ్ అభిమానుల ప్రభావం చాలా ఎక్కువ. దీంతో ఏపీలో మిగిలిన మునిసిపల్ ఎన్నికల కన్నా ఈ నియోజకవర్గంలో మాత్రం ఈ రెండు పార్టీల మధ్య ఆసక్తికర పోటీ నడవనుంది. టీడీపీ ఇక్కడ మళ్లీ మూడో స్థానంతో సరి పెట్టుకోనుంది. టీడీపీ ఇక్కడ నాలుగైదు సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేదు. మరి ఈ పోరులో ఎవరు విన్ అవుతారో ? చూడాలి.