హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి.. బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావు.. ఆర్ఎల్ డీ తరఫున పోటీ చేస్తున్న కపిలవాయి దిలీప్ కుమార్ లు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు. స్వంత్రత్య అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న ప్రొఫెసర్ నాగేశ్వర్ వైశ్య సామాజిక వర్గానికి చెందిన వారు. ఇక కాంగ్రెస్ రెడ్డి వర్గానికి చెందిన చిన్నారెడ్డికి సీటు ఇస్తే.. టీడీపీ బీసీ వర్గానికి చెందిన పార్టీ నేత ఎల్. రమణను పోటీకి పెట్టింది. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేస్తున్న వారిలో అత్యధికులు ఓసీలుగా కనిపిస్తారు.
ఇక వీరిలో పీవీ కుమార్తె సురభి వాణి, బీజేపీ అభ్యర్థి రాం చందరరావు, కపిలవాయి దిలీప్ బ్రాహ్మణ వర్గం వారు. ఇలా ప్రధాన పార్టీలు అన్ని కూడా ఒకే తాటిమీదకు వచ్చి బ్రాహ్మణులనే కొన్ని చోట్ల పోటీ పెడితే ఖచ్చితంగా ఎవరో ఒకరు బ్రాహ్మణులే గెలుస్తారు. ఇలా జరిగినప్పుడే బ్రాహ్మణులు చట్ట సభలకు ఎంపిక కావడంతో పాటు వీరికి రాజకీయంగా న్యాయం జరుగుతుంది. మరి ఈ పరిస్థితిలో ఎప్పటకి మార్పు వస్తుందో ? చూడాలి.
బ్రాహ్మణులారా.. జాగృతం కండి
తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మణులారా.. జాగృతం కండి. మీ హక్కులు తెలుసుకోండి..! ఓటు బ్యాంకుగా ఉపయోగపడుతున్నారే తప్ప... మీ సమస్యలు పరిష్కరించేందుకు ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకు రావడం లేదనే విషయాన్ని గుర్తించండి. ప్రభుత్వాలు మారినా.. మీ సమస్యలు మాత్రం తీరడం లేదు. ఎప్పటికప్పుడు సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని పరిష్కరించేందుకు ఏ ఒక్కరూ బాధ్యతలు తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో మీ గళాన్ని వినిపించేందుకు https://www.indiaherald.com/ముందుకు వచ్చింది. బ్రాహ్మణుల సమస్యలను ప్రభుత్వానికి చేరవేసేందుకు https://www.indiaherald.com/ ప్రయత్నిస్తోంది. దీనిలో మీ భాగస్వామ్యమే కీలకం. మీ సమస్య ఏదైనా.. ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు మేం ముందుంటాం.
మీరు చేయాల్సిందల్లా.. ఈ ఫోన్ నెంబరు 8919011959
కు ఫోన్ చేయడమే. లేదా care@indiaherald.com ఈ మెయిల్‌కు మీ సమస్యను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడమే..!