అయితే, 2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కొత్తగా ఎమ్మెల్యే లు, ఎంపీ లు ఎన్నికయ్యారు.పట్టణాల అభివృద్ధికి సంబంధించి సరైన ప్రణాళికతో ముందుకెళ్లలేదు. చాలా ప్రాంతాల్లో రహదారులు, కాలువలు, కల్వర్టులు, తాగునీటి వనరుల నిర్మాణాలు జరగకపోవడం తో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇప్పటికీ నగరాల్లో అదే పరిస్థితి కొనసాగుతుంది.ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి మంజూరైన 14వ ఆర్థిక సంఘం నిధులన్నీ అమృత్ పథకానికి మళ్లించారు. ఇతరత్రా పనులకు వినియోగించకుండా నేరుగా అమృత్ పథకం లోని నిర్మాణ పనులకు వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.
వీటి ద్వారా పట్టణాని కి సురక్షిత తాగు నీటిని సరఫరా చేయనున్నారు. 2015 నుంచి ఇప్పటి వరకు రూ.35.55 కోట్లు మంజూరు కాగా, రూ.34.70 కోట్లు ఖర్చు చేశారు. రూ.2 కోట్ల తో సీసీ రహదారులు, మురుగు కాలువలు తదితర నిర్మాణ పనులు చేపట్టారు. మరో రెండు కోట్ల తో గ్యాస్ శవ దహన వాటికను ప్రారంభించారు. ఆ పథకం ఆది లోనే ఆగింది. ప్రొద్దుటూరు తో పాటుగా బద్వేల్, జమ్మలమడుగు, రాజంపేట, కడప, మైదుకూరు నగర ప్రాంతాల్లో కూడా ఎటువంటి అభివృద్ది జరగలేదని తెలుస్తుంది. ఇప్పుడు ఎన్నికలు వస్తుండటంతో అధికారులు చర్యలు చేపట్టారు. నిధులు ఉండి కూడా అభివృద్ది జరగక పోవడం ఏంటని ప్రజలు ప్రశ్నించారు.