వివరాలలోకి వెళితే ఆస్ట్రేలియాలోని కమిలోకు చెందిన ప్రముఖ హేయిర్ లైస్ రిమూవలిస్ట్ షెర్రీ రిచర్డ్సన్ '' నిట్ పైకర్స్ హెడ్ లైస్ రిమూవల్'' పేరిట ఓ సెలూన్ నిర్వహిస్తోంది .కొన్ని రోజుల క్రితం విపరీతంగా పేలతో బాధపడుతున్న ఒక యువతి ఆమె దగ్గరకు వచ్చింది. ఆ యువతికి పేలను తొలగించే క్రమములో దువ్వెనతో ఆ యువతి తలను దువ్వగా కుప్పలు కుప్పలుగా దువ్వెనలో పేలు వచ్చాయి.
అన్ని పేలను ఒక్కసారిగా చూడడంతో ఆమె షాక్ అయ్యి ఆ పేలని వీడియో తీసి తన టిక్‌టాక్ ఖాతాలో పోస్ట్ చేసింది.. ఇప్పుడు ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఏకంగా ఐదు మిలియన్ల మంది ఆ వీడియోను చూసారు. ఆ వీడియో చూసి ఎవరికీ తోచిన విధంగా వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు తమకు తోచినట్లు ఫన్నీగా కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఏమి పెట్టి ఆ పేలను మేపుతున్నావ్ తల్లి అని ఒకరు అంటే.. ప్రేమలో పడినోళ్లు.. తల్లో పేలు ఉన్నోళ్లు సుఖపడినట్లు చరిత్రలో లేదని మరొకరు కామెంట్స్ పెడుతున్నారు. అసలు తల్లో అన్ని పేలు పెట్టుకుని ఎలా జీవిస్తున్నావ్ నువ్వు అని మరికొందరు సెటైర్స్ వేస్తున్నారు.. !!