ధర రూ.60. ఇష్టమున్నంత తినొచ్చు. పూర్తిగా శాకాహారం మాత్రమే. బిర్యానీతోపాటు అదనంగా గ్రేవీ, సలాడ్, పెరుగు, స్వీట్, మినరల్ వాటర్ ఇస్తారు. నాలుగురోజుల క్రితమే దీన్ని ఏర్పాటు చేయగా..తొలిరోజు 20 ప్లేట్లవరకు విక్రయించారు. రోజురోజుకు ఆదరణ పెరుగుతున్నదని అన్నారు అన్నదమ్ములైన ఉదయ్,కిరణ్‌లు. తక్కువ ధర అని నాసిరకం కాకుండా బాస్మతి బియ్యాన్ని వినియోగిస్తున్నామన్నారు. నిత్యం రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు పెట్టుబడి పెడుతున్నట్లు చెప్పారు.. పెద్ద యూనివర్సిటీలో పెద్ద పెద్ద చదువులు చదివారు.
ఒక వస్త్ర దుకాణం లో పదేండ్లపాటు మేనేజర్‌గా, ఆ తర్వాత రెస్టారెంట్‌లో పనిచేశాడు. అంతంత మాత్రమే జీతం వస్తుండడం, ఎదుగుదల లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. కిరణ్ పదోతరగతి చదువుకున్నాడు.. రూ.15 వేల ప్రైవేటు ఉద్యోగం వదులుకొని ఇద్దరు కలిసి తిన్నంత బిర్యానీ' పాయింట్ ప్రారంభించారు.బిర్యానీపై మోజు ఉన్నవారు తిన్నంత బిర్యానీని ఆదరిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఉప్పల్-రామంతాపూర్ మార్గంలో రూ.60 చెల్లించి 'తిన్నంత బిర్యానీ' పాయింట్‌లో తింటున్నామని, రుచిగా ఉందని పలువురు అంటున్నారు. దీంతో రోజు రోజుకు వీరి బిరియాని కి డిమాండ్ పెరుగుతుంది.. పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అని వీరు నిరూపించారు.