సాధరణంగా మనం కర్పూరాన్ని పూజా చేసే అప్పుడు దేవునికి హారతి ఇవ్వడానికి ఉపయోగిస్తాము కదా.. కానీ కర్పూరాన్ని కేవలం దేవుడికి హారతిగా మాత్రమే ఉపయోగిస్తాం అనుకుంటే పొరపాటు పడినట్లే. కర్పూరం వలన మనకి ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకొండి మరి. కర్పూరంలో కొంచెం  నెయ్యి  వేసి  పేస్టులా  చేసి దాన్ని శరీరంపై పడిన గాయాలపై రాసుకుంటే  రక్త స్రావం తగ్గుతుంది. అంతేకాదు గాయాలకు చీము పట్టకుండా, ఇన్ఫెక్షన్  సోకకుండా ఉండేలా చూస్తుంది. అలాగే మీకు ఎప్పుడన్నా తల నొప్పిగా అనిపించినప్పుడు  కర్పూరం-నెయ్యి  పేస్ట్ ను  కణతలకు రాసుకుంటే  ఎంతో  ఉపశమనంగా  ఉంటుంది.


కర్పూర తైలాన్ని కొద్దిగా నీటిలో  వేసి, ఆ నీటితో  శరీరంపై దద్దుర్లు వచ్చిన చోట, చర్మం ఎర్రబారిన చోట రాసుకుంటే తగ్గుతుంది. మీకు రాత్రిళ్ళు నిద్ర పట్టకపోతే కొన్ని చుక్కల కర్పూర తైలాన్ని మీరు పడుకునే  దిండు మీద చల్లాలి. కర్పూర తైలం వాసన  పీల్చితే చక్కగా నిద్ర పడుతుంది.కర్పూరం జలుబు, దగ్గును నయం చేస్తుంది.మనం జలుబు వస్తే రాసుకునే విక్స్, మెంతో ప్లస్ బామ్స్ లో కర్పూరంను వాడుతూ ఉంటారు. అలాగే బాగా జలుబు ఉన్నట్లయితే కొంచెం కొబ్బరి నూనెను వేడి చేసి, అది గోరు వెచ్చగా ఉన్నప్పుడు అందులో  కర్పూరం వేసి కరగ బెట్టాలి. దానిని శరీరానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది


అంతే కాకుండా మీరు తలకి రుద్దుకునే నూనెలో  కొద్దిగా కర్పూర తైలం కలిపి మాడుకు రాసుకోవాలి. ఇలా చేయడం వలన తలలో రక్త ప్రసరణ బాగా జరిగి కురులు తొందరగా  పెరుగుతాయి.అలాగే పేల సమస్యతో ఎవరయితే ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళుకి కర్పూర తైలం బాగా ఉపయోగపడుతుంది.తల స్నానం చేసేటప్పుడు ఆ నీళ్లలో కొద్దిగా  కర్పూర తైలం వేస్తే సరి.ఆ వాసనకి పేలు, చుండ్రు నశిస్తాయి.. !!

మరింత సమాచారం తెలుసుకోండి: