ప్రస్తుతం ప్రతి మనిషి జీవితంలో టీ కాఫీలు అనేవి ఒక భాగం గా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే. ఒక రోజు మొత్తం ఆహారం తినకుండా అయినా  ఉంటారేమో కానీ కాఫీ తాగకుండా ఉండలేని  వాళ్ళు చాలామంది ఉన్నారు.  అంతేకాదు ఇక కాఫీ తాగడం వల్ల ప్రతి ఒక్కరిలో కొత్త ఉత్సాహం నిండి పోతుంది అని భావిస్తూ ఉంటారు.అంతే కాకుండా ప్రస్తుతం ఉరుకులు పరుగుల జీవితంలో అందరూ ఎంతో ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడుపుతూ ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఒక వేడి వేడి కాఫీ తాగి ఉపశమనం పొందడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు.  ఇక మరికొంతమంది కాఫీ తాగడం వల్ల ఎన్నో టెన్షన్స్ కూడా దూరం అవుతాయి అని నమ్ముతూ ఉంటారు.



 ఇలా రోజురోజుకు కాఫీ తాగే వారి సంఖ్య పెరిగి పోతూనే ఉంది. కాఫీ తాగడం వల్ల అందరూ ఒత్తిడిని దూరం చేయొచ్చు అని భావిస్తూ ఉంటారు. అయితే కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు అని ఎన్నో అధ్యయనాల్లో వెల్లడైంది అన్న విషయం తెలిసిందే.  అదే సమయంలో ప్రతిరోజూ కాఫీ తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు అని మరి కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. ఇలా పలు అధ్యయనాల్లో వివిధ రకాల విషయాలు వెల్లడి కావడంతో కాఫీ తాగే వారు ఏ విషయాన్ని నమ్మాలా అని తెలియక అయోమయంలో ఉంటూ ఉంటారు. ఇటీవలే యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో మరో ఆసక్తికర విషయం వెల్లడయింది.



 అయితే ప్రతి రోజూ మూడు కప్పుల కాఫీ తాగే వారిలో గుండె సమస్యలు వచ్చే అవకాశం తక్కువగా ఉంది అని ఈ అధ్యయనంలో వెల్లడైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అంతేకాకుండా కాలేయ వ్యాధులు కూడా దరిచేరే అవకాశం తక్కువగా ఉంటుంది అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. అయితే గర్భిణీలు మాత్రం కాఫీ విషయంలో ఎంతో జాగ్రత్తలు పాటించాలి అని సూచిస్తున్నారు. గర్భిణీలు ప్రతిరోజూ రెండు కప్పుల కంటే ఎక్కువగా ఇన్స్టెంట్ కాఫీని తీసుకుంటే ఇక గర్భస్రావం అయ్యే అవకాశం ఉందని అందుకే గర్భిణీలు కాఫీ కి కాస్త దూరంగా ఉండడమే మంచిది అని సూచిస్తున్నారు పరిశోధకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: