
అయితే ఈ మధ్య కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య వీర్య కణాలు తక్కువగా ఉండడం. వివిధ రకాల కారణాల వల్ల వీర్యకణాలు తక్కువగా ఉండటంతో ఎంతోమంది తమ భాగస్వామితో శృంగారం చేసినప్పటికీ పిల్లలుపుట్టక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఇక వీర్యకణాల సంఖ్యను పెంచుకోవడానికి డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు అన్న విషయం తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు ఎంత మంది డాక్టర్ల చుట్టూ తిరిగిన ప్రయోజనం లేకుండా పోతుంది. అయితే డాక్టర్ల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాడమే కాదు కొన్ని రకాల వంటింటి చిట్కాలు పాటిస్తే చాలు వీర్యకణాల సంఖ్యను పెంచుకునే అవకాశం ఉంటుంది అని సూచిస్తున్నారు నిపుణులు.
వీర్యకణాల సంఖ్యను పెంచుకోవడానికి పురుషులు ఎక్కువగా ట్రీ నట్స్ తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది అని నిపుణులు సూచిస్తున్నారు. బాదం, హేజల్ నట్స్, వాల్నట్స్ లాంటివి 14 వారాల పాటు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వీర్యకణాల సంఖ్యను పెంచుకునేందుకు ఎంతగానో అవకాశం ఉంది అని సూచిస్తున్నారు నిపుణులు. ఒకవేళ మీరు వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండటం కారణంగా పిల్లలు పుట్టక ఇబ్బంది పడుతూ ఉంటే ఇక ఇలా 14 వారాల పాటు ప్రయత్నిస్తే మంచి ఫలితం లభించే అవకాశం ఉంది అని సూచిస్తున్నారు నిపుణులు.