ఇప్పుడు అదే గుంటూరు జిల్లాలో.. అదే పల్నాడు ప్రాంతంలో ఉన్న పిడుగురాళ్ల మున్సిపాల్టీ సైతం వైసీపీకి ఏకగ్రీవం అయ్యింది. మాచర్ల మున్సిపాల్టీలో 31 వార్డులు ఉంటే అక్కడ పోటీ చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో, 5 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయగా... వారు బీ ఫామ్‌లు తీసుకునేందుకు కూడా ముందుకు రాని పరిస్థితి. దీంతో మాచర్ల ఇప్పటికే ఏకగ్రీవం అయ్యింది. ఇక ఇప్పుడు పిడుగురాళ్లది కూడా అదే పరిస్థితి రిపీట్ అయ్యింది. అక్కడ 33 వార్డులుక 135 నామినేషన్లు పడ్డాయి.
నామినేషన్ల ఉప సంహరణ చివరి రోజు వైసీపీ వాళ్లు తప్పా అందరూ ఉప సంహరించుకున్నారు. దీంతో ఈ మునిసిపాల్టీ కూడా వైసీపీకి ఏకగ్రీవం అయ్యింది. కొత్త సుబ్బారావును మునిసిపల్ చైర్మన్ గా ఎన్నుకున్నారు. ఇక ఇప్పుడు జిల్లాలో ఐదు మున్సిపాల్టీలకే ఎన్నికలు జరుగుతున్నాయి. గుంటూరు కార్పొరేషన్ తో పాటు ఈ మున్సిపాల్టీల్లో అయినా వైసీపీ కి టీడీపీ పోటీ ఇస్తుందేమో ? చూడాలి.