పిస్తా పప్పులో విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి. వీటిలో విటమిన్ ఏ,విటమిన్ బి,విటమిన్ E,ఫాస్ఫరస్,ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం,ప్రోటీన్,ఫైబర్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యానికి మంచిది అన్నాము కదా అని పిస్తా పప్పులను అతిగా తింటే మాత్రం లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే పిస్తా పప్పును లిమిట్ గా తీసుకుంటే మెదడు పదునుగా పనిచేస్తుంది.ఆలోచన శక్తి అనేది పెరుగుతుంది.అదే పిస్తా పప్పును అధికంగా తీసుకుంటే కిడ్నీలో రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంది. వీటిని ఎక్కువగా తీసుకున్నప్పుడు కాల్షియం ఆక్సాలేట్, సిస్టైన్ లాంటివి మూత్రపిండాల్లో పేరుకు పోయి అక్కడ రాళ్లు ఏర్పడేలా ప్రేరేపిస్తాయి.అంతేకాకుండా ఎలర్జీ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
ముఖ్యంగా దద్దుర్లు, చర్మం దురద పెట్టడం, తుమ్ములు వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. అందువల్ల ఇలాంటి ఎలర్జీ ఉన్నవారు పిస్తా పప్పుకు కొంచెం దూరంగా ఉంటేనే మంచిది. అలాగే ఈ పప్పులను అతిగా తింటే బరువు పెరిగే అవకాశం కూడా ఉంది. అలాగే కడుపు నొప్పి , మలబద్ధకం, అతిసారం వంటి సమస్యలు వస్తాయి.అందుకనే పిస్తా పప్పుని లిమిట్ గా తీసుకోమని నిపుణులు సలహా ఇస్తున్నారు.
ఏదయినా గాని లిమిట్ గా తీసుకుంటేనే ఆరోగ్య ప్రయోజనలు కలుగుతాయి. ఆరోగ్యానికి మంచిది అన్నాము కదా అని అతిగా తీసుకుంటే మాత్రం ఆరోగ్యం మాట దేవుడెరుగు లేనిపోని అనారోగ్యాలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది.